కరోనా నుంచి రక్షణ కోసం మాస్క్ కొనుగోలు చేసేందుకు వెళ్లి తిరిగొచ్చేలోపే ఇంటిని లూటీ చేశారు దొంగలు. ఈ ఘటన మహారాష్ట్ర పుణె జిల్లాలో జరిగింది. బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది.
ఇదీ జరిగింది...
పుణెలోని హదప్సర్ హౌసింగ్ సొసైటీలో ఓ మహిళ(25) నివాసం ఉంటోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్క్ కొనుగోలు చేసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. యువతి లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు సుమారు రూ.40 వేలు విలువైన బంగారు ఆభరణాలు, రూ.6 వేలు నగదును దోచుకెళ్లారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు.
నగరంలో 10 కరోనా కేసులు
పుణెలో ఇప్పటివరకు 10 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున మాస్కులు కొంటున్నారు. అయితే.. వైరస్ ఉన్నవారు, వారితో సన్నిహితంగా ఉన్నవారు మాత్రమే మాస్కులు ధరిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ఇక మాస్కులు, శానిటైజర్లు నిత్యావసర వస్తువులే