ETV Bharat / bharat

దిల్లీ ఓటింగ్​ శాతం ప్రకటనలో ఎందుకింత జాప్యం?

దిల్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఓటింగ్​ శాతం ప్రకటించడానికి ఆలస్యం ఎందుకైంది? జాప్యం జరగడంపై ఆమ్​ఆద్మీ ఇప్పటికే పలు విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో ఓటింగ్​ శాతం ప్రకటనలో ఎలాంటి జాప్యం జరగలేదని 'ఈటీవీ భారత్'​ ముఖాముఖిలో స్పష్టం చేశారు దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి రణ్​బీర్​ సింగ్​. రాత్రంతా అధికారులు సమాచారం నమోదులో నిమగ్నమైన క్రమంలో ఆ తర్వాత ప్రకటించామని తెలిపారు.

Delhi Chief Electoral Officer
దిల్లీ ఓటింగ్​ శాతం ప్రకటనలో ఎందుకింత జాప్యం?
author img

By

Published : Feb 10, 2020, 10:59 AM IST

Updated : Feb 29, 2020, 8:26 PM IST

దిల్లీ ఓటింగ్​ శాతం ప్రకటనలో ఎందుకింత జాప్యం?

దిల్లీ ఎన్నికల తుది ఓటింగ్​ శాతం ప్రకటనలో ఎలాంటి అనధికారిక జాప్యం జరగలేదని స్పష్టం చేశారు హస్తిన ప్రధాన ఎన్నికల అధికారి రణ్​బీర్​ సింగ్​. ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్లీ ఎన్నికలపై కీలక విషయాలు వెల్లడించారు​.

ఓటింగ్​ శాతం ప్రకటనపై ఆమ్​ఆద్మీ పార్టీ ఆరోపణలను ఖండించారు. సమాచారం పరిశీలనలో రిటర్నింగ్​ అధికారులు నిమిగ్నమయ్యారని.. ఓటింగ్​ శాతం ప్రకటించటంలో ఎలాంటి అనధికారిక జాప్యం జరగలేదని స్పష్టం చేశారు.

" పోలింగ్​ సాయంత్రం 6 గంటల వరకు జరిగిన క్రమంలో రిటర్నింగ్​ అధికారులు రాత్రంతా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గం వారిగా పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేసిన అనంతరం పరిశీలన పూర్తయింది. డేటాను నిక్షిప్తం చేసే క్రమంలో కచ్చితత్వం చాలా ముఖ్యం కావున ఎక్కువ సమయం పట్టింది. "

- రణ్​బీర్​ సింగ్​, దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి.

బాబర్​పుర్ నియోజకవర్గంలో ఓ అధికారి ఎన్నికల కేంద్రానికి ఈవీఎంను చేతిలో పట్టుకుని తీసుకువెళ్లడంపై సమాధానమిచ్చారు సింగ్​. పోలింగ్​ కేంద్రం​ కొంచెం దూరంగా ఉండటం వల్ల అక్కడి వరకు చేతిలో పట్టుకుని తీసుకెళ్లారని తమ విచారణలో తేలినట్లు స్పష్టం చేశారు.

ఆప్​ విమర్శలు..

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 8వ తేదీన జరిగాయి. అయితే వెంటనే తుది ఓటింగ్​ శాతాన్ని ప్రకటించకపోవటంపై ఆమ్​ ఆద్మీ పార్టీ నేత సంజయ్​ సిగ్​ ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. బ్యాలెట్​ వ్యవస్థ ఉన్నప్పటి మాదిరిగా ఈసీలో అంతర్గత రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్​ అధినేత కేజ్రీవాల్​.. ట్విట్టర్​ వేదికగా ఈసీపై విమర్శలు గుప్పించారు. ఓటింగ్​ పూర్తయి గంటలు గడిచినా తుది ఓటింగ్​ శాతాన్ని ప్రకటించకపోవటం ఆశ్చర్యానికి గురి చేసిందని.. ఈసీ ఏం చేస్తోందని ప్రశ్నించారు.

Last Updated : Feb 29, 2020, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.