మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని, ముఖ్యమైన పారామితులు స్థిరంగా ఉన్నట్లు ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
ప్రణబ్ ముఖర్జీని వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు.
2012 నుంచి 2017 వరకు భారత రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు ప్రణబ్.
మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్‌కు ఈ నెల 10వ తేదీన శస్త్రచికిత్స చేశారు. ఆ సమయంలో జరిపిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.