మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని దిల్లీలోని సైనిక ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈమేరకు ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి ఊపిరితుత్తుల ఇన్ఫెక్షన్కు చికిత్స చేస్తున్నట్లు వైద్యులు చెప్పారు. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నట్లు తెలిపారు.
మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ఈనెల 10న దాదాకు శస్త్రచికిత్స నిర్వహించారు. అంతకుముందు నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.
ఇదీ చదవండి: ప్రతి రోజూ పళ్లెంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా..