సత్వర న్యాయం సాధ్యపడదంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే చేసిన వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. తక్షణ న్యాయం సాధ్యపడదన్న బోబ్డే వ్యాఖ్యలను సమర్థించారు. దిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.
సత్వర న్యాయం అనే విషయం ఉండకూడదని, అదేవిధంగా న్యాయం జరిగే విషయంలో ప్రతిసారీ ఆలస్యం ఉండకూడదని అన్నారు. న్యాయం జరగడంలో నిరంతర జాప్యం వల్ల ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఎలక్షన్ పిటిషన్లు, శాసన, పార్లమెంట్ సభ్యులపై ఉన్న క్రిమినల్ కేసుల వంటి వాటిపై సమయానుగుణంగా ఓ నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.
ఇదీ చూడండి: న్యాయం ప్రతీకారంగా మారకూడదు: జస్టిస్ బోబ్డే