ETV Bharat / bharat

'నాటి కార్గిల్ యుద్ధానికి నేటి చైనా చొరబాట్లకు సారుప్యతలు'

1999లో పాకిస్థాన్​తో జరిగిన కార్గిల్ యుద్ధానికి, ఇప్పుడు తూర్పు లద్దాఖ్​లో చైనా చొరబాట్లకు చాలా సారుప్యతలున్నాయని చెప్పారు ప్రముఖ రక్షణ నిపుణులు విక్రమ్​జిత్ సింగ్​. భారత సైన్యం వీరోచిత పోరాటంతో కార్గిల్​ యుద్ధంలో విజయం సాధించి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈటీవీ భారత్​తో ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు. ఆనాడు కార్గిల్​లో పాక్​ సైనికులు ఆగస్టు 3న చొరబడితే, ఇప్పుడు గల్వాన్​ లోయలో చైనా సైనికులు ఆగస్టు 5న దురాక్రమణలకు పాల్పడ్డారని వివరించారు.

There are a lot of similarities between Kargil conflict and recent Chinese intrusion: Defence expert
'నాటి కార్గిల్ యూద్ధానికి నేటి చైనా చొరబాట్లకు సారుప్యతలు'
author img

By

Published : Jul 26, 2020, 11:01 PM IST

భారత్​-పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగి 21ఏళ్లు పూర్తవుతోంది. 1999లో వాస్తవాధీన రేఖ వెంబడి దురాక్రమణలకు పాల్పడిన పాక్​ సైన్యాన్ని శౌర్య పరాక్రమాలతో మట్టికరిపించింది భారత సైన్యం. దాయాది దేశంపై ఘన విజయం సాధించింది. ఆనాటి పాక్ చొరబాట్లకు, ఇప్పుడు తూర్పు లద్దాఖ్​లో చొరబాట్లకు పాల్పడుతున్న చైనా ఘటనలకు అనేక సారుప్యతలున్నాయని చెబుతున్నారు ప్రముఖ రక్షణ నిపుణులు విక్రమ్​జిత్​ సింగ్. 'కార్గిల్ విజయ్​ దివస్' సందర్భంగా ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు.

'నాటి కార్గిల్ యూద్ధానికి నేటి చైనా చొరబాట్లకు సారుప్యతలు'

'1999 ఆగస్టు 3న కార్గిల్​లో పాక్​ సైన్యం చొరబడింది. ఇప్పుడు 2020లో చైనా సైన్యం ఆగస్టు 5న గల్వాన్​ లోయలో చొరబాట్లకు పాల్పడింది. అప్పుడు పాక్​ చొరబాట్లను 3వ పంజాబ్ రెజిమెంట్ గుర్తించింది. ఇప్పుడు గల్వాన్​లోయలో జూన్​ 15న చైనా సైనికులతో ఘర్షణలో అదే రెజిమెంట్​ ఇతర రెజిమెంట్లతో కలిసి పోరాడింది. వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలను ఉపసంహరించుకుంటేనే పాక్​తో చర్చలని అప్పటి ప్రధాని వాజ్​పేయీ కరాకండీగా చెప్పారు. ఇప్పుడు చైనాతో దౌత్య చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది . చైనాతో ఉద్రిక్తతలు తలెత్తి రెండు నెలలు దాటినా సరిహద్దులో ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు. కానీ కార్గిల్ యుద్ధ సమయంలో దీపావాళి బాణసంచాలా కాల్పుల మోత మోగింది' అని తెలిపారు సింగ్. అయితే కార్గిల్ యుద్ధ సమయంలో పాక్​కు మద్దతుగా రావడానికి చైనా నిరాకరించిందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం వస్తే చైనాకు మద్దతుగా పాక్​ నిలిచే అవకాశాలున్నాయన్నారు.

ఇదీ చూడండి: 'భాజపా కుట్రలను ప్రజలు తిరస్కరిస్తారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.