ETV Bharat / bharat

కరోనాతో అక్కడి థియేటర్లు, పాఠశాలలు బంద్​

కేరళలో కరోనా వైరస్​ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేపటి నుంచి ఈ నెల 31 వరకు రాష్ట్రంలో థియేటర్లు మూసివేయనున్నారు. సీబీఎస్​ఈ, ఐసీఎస్​ఈ పాఠశాలల్లో 1 నుంచి 7 తరగతులకు సెలవు ప్రకటించారు. శబరిమలకు రావాలన్న ఆలోచనను భక్తులు ప్రస్తుతానికి విరమించుకోవడం మంచిదని సూచించారు.

theaters-to-remain-shut-from-tomorrow-amid-corona-virus-fear
కరోనాతో అక్కడ థియేటర్లు, పాఠశాలలు బంద్​
author img

By

Published : Mar 10, 2020, 5:11 PM IST

Updated : Mar 10, 2020, 7:39 PM IST

కరోనాతో అక్కడి థియేటర్లు, పాఠశాలలు బంద్​

భారత్​ను కరోనా వైరస్​ కలవరపెడుతోంది. కేరళలో వైరస్​ ప్రభావం ఎక్కువగా ఉంది. తాజాగా ఆరుగురికి వ్యాధి నిర్ధరణ అయినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 15కు చేరింది.

థియేటర్లు బంద్​...

వైరస్​ భయంతో ఇప్పటికే రాష్ట్రంలోని సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి ఈ నెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. వివిధ మలయాళీ సినీ సంస్థలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

'శబరిమలకు రాకండి...'

కేరళలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో శబరిమల ఒకటి. అయప్ప స్వామి దర్శనం కోసం నిత్యం వేల మంది భక్తులు శబరిమలకు తరలివెళ్తారు. అయితే కరోనా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో.. భక్తులు శబరిమలను సందర్శించకపోవడం మంచిదని ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు వాసు చెప్పారు. వేడుకలను రద్దు చేసుకోవాలని ఇతర ఆలయాలకు సూచించారు.

పెళ్లి వేడుకలను అనుమతిస్తున్నప్పటికీ... ప్రజలు హాజరుకాకూడదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి.

పరీక్షలు...

శబరిమల, థియేటర్లతో పాటు విద్యా వ్యవస్థపైనా కరోనా ప్రభావం పడింది. సీబీఎస్​ఈ, ఐసీఎస్ఈ పాఠశాలల్లోని 1-7 తరగతులకు సెలవు ప్రకటించారు అధికారులు. అయితే 8,9,10 తరగతులతో పాటు మాధ్యమిక విద్యకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. కళాశాలలు కూడా మూతపడనున్నట్టు స్పష్టం చేశారు.

కర్ణాటకలో...

కర్ణాటకలో తాజాగా మూడు కేసులు నమోదయ్యాయి. దీని వల్ల అక్కడ కరోనా సోకిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, పారామెడికోలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న పథకాలతో పాటు అదనపు ఆరోగ్య బీమా కవరేజ్​​ ఇవ్వాలని యోచిస్తోంది. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ కె.సుధాకర్ ఈ విషయం వెల్లడించారు. వైద్యులు, సిబ్బంది భద్రత ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు.

Last Updated : Mar 10, 2020, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.