చైనా 'షేరిట్' యాప్‌ను తలదన్నేలా 'జీ షేర్' యాప్‌ను సృష్టించాడు కర్ణాటకకు చెందిన శ్రవణ్ హెగ్డె. ఉత్తర కర్ణాటక, సిద్ధాపుర్ తాలుకాకు చెందిన శ్రవణ్ వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. ధార్వాఢాలో కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ చివరి సంవత్సరం చేస్తున్నాడు. విద్యార్థి దశలోనే ఎన్నో ప్రయోగాలు చేశాడు శ్రవణ్. అందులో బాగంగానే 'ఎగ్జామ్ పేపర్' యాప్‌ను రూపొందించాడు.
ఇక, గల్వాన్ ఘటన తర్వాత చైనా యాప్‌లకు ప్రత్యామ్నాయం కనిపెట్టాలనుకున్నాడు శ్రవణ్. భారతీయలు ఫొటోలు, వీడియోలు, యాప్‌లు ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కు ఇంటర్నెట్ లేకుండా పంపించడానికి షేరిట్ యాప్‌ను అధికంగా వాడుతున్నరని గ్రహించాడు. 15 రోజులు తీవ్రంగా శ్రమించి షేరిట్ యాప్‌లో ఉండే ఫీచర్లతో స్వదేశీ జీ షేర్ కనిపెట్టేశాడు.
జీ షేర్ యాప్ గూల్ ప్లేస్టోర్‌లో పెట్టిన 24 గంటల్లోనే భారతీయులను మెప్పించింది. ఒక్కరోజులో స్వదేశీ జీ షేర్ యాప్‌ను 3,700 మంది డౌన్లోడ్ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.
ఇదీ చదవండి: కరోనా నమూనాలు సేకరిస్తున్న రోబో!