ETV Bharat / bharat

భారత్​లో 107కు చేరుకున్న కరోనా కేసులు - కరోనా జాతీయ విపత్తు

దేశంలో కరోనా కేసుల సంఖ్య 107కు చేరుకుంది. ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులు వైరస్​ కారణంగా మృతి చెందారు . ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మహమ్మారిని జాతీయ విపత్తుగా ఇప్పటికే ప్రకటించింది.

The total number of positive cases of Coronavirus in the country rises to 93.
దేశంలో 93కు చేరుకున్న కరోనా కేసులు
author img

By

Published : Mar 15, 2020, 9:56 AM IST

Updated : Mar 15, 2020, 12:56 PM IST

చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్​ భారత్​లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా మొత్తం 107 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులు ఈ మహమ్మారికి బలయ్యారు. ఇప్పటికే కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది కేంద్రం.

మహారాష్ట్ర ఔరంగాబాద్​లో 59 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. ఇప్పటివరకు అత్యధికంగా రాష్ట్రంలోనే 31 కేసులు నమోదయ్యాయి. మిజోరంలో 117 మంది కరోనా వైరస్‌ అనుమానితులను గుర్తించిన అధికారులు.. వారిని ఇళ్లలోనే నిర్బంధించారు. సోమవారం నుంచి కర్తార్‌పూర్‌ కారిడార్‌ పర్యటన, రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

దిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, పంజాబ్​ సహా పలు రాష్ట్రాలు థియేటర్లు, పాఠశాలు, పబ్​లను మూసి వేస్తున్నట్లు ప్రకటించాయి.

ఇదీ చూడండి:దేశంలో 'జనగణ' మన సమస్య ఇది!

Last Updated : Mar 15, 2020, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.