దేశంలో కరోనా కేసులు 536కి చేరుకుంది. ఇప్పటి వరకు 10మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహమ్మారి బారిన పడిన వారిలో 43మంది విదేశీయులు కాగా వారిలో40 మంది కోలుకున్నట్లు తెలిపింది. మహారాష్ట్ర, దిల్లీలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. బిహార్, కర్ణాటక, గుజరాత్, పంజాబ్‌లో ఇప్పటికే ఒక్కొక్కరు చొప్పున మరణించారు. బంగాల్, హిమాచల్ ప్రదేశ్‌లో మంగళవారం తొలి మరణాలు నమోదు అయ్యాయి.
మణిపూర్‌లో తొలికేసు నమోదు కాగా అత్యధికంగా మహారాష్ట్రలో 106 కేసులు నమోదయ్యాయి. కేరళలో మొత్తం 95, కర్ణాటక.. 37, ఉత్తర్‌ప్రదేశ్ 33, రాజస్థాన్ 32, దిల్లీ 30, గుజరాత్ 33, హరియాణాలో 28, పంజాబ్‌లో 29 కరోనా పాజిటివ్ కేసులు లెక్కతేలాయి.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న విదేశీయులను రెండు ప్రత్యేక విమానాల్లో జైపూర్‌కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
ఇదీ చూడండి: భారత్ లాక్డౌన్: 21 రోజులు అందుబాటులో ఉండేవి ఇవే