తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివాసమున్న చెన్నై పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయాన్ని స్వాధీనం చేసుకుంటూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
ఇంట్లోని 4.37 కిలోల బంగారం (14 ఆభరణాలు), 601.42 కిలోల వెండి (867 నగలు), చిన్నపాటి వెండి వస్తువులు-162, టీవీలు-11, ఫ్రిజ్‌లు-10, ఏసీలు-38, ఫర్నీచరు-556, వంటగది వస్తువులు-6,514, వంట గది అల్మారా ఫర్నీచరు-12, అలంకరణ వస్తువులు-1,055, పూజా సామగ్రి-15, వివిధ రకాల వస్త్రాలు, పాదరక్షలు-10,438, టెలిఫోన్లు, మొబైల్ ఫోన్లు-29, వంటగది ఎలక్ట్రికల్ వస్తువులు-221, ఎలక్ట్రికల్ పరికరాలు-251, పుస్తకాలు-8,376, జ్ఞాపికలు-394, కోర్టుపత్రాలు, ఐటీ నివేదికల పత్రాలు-653, స్టేషనరీ వస్తువులు-253, సూట్కేసులు-65, కాస్మొటిక్ వస్తువులు-108, గడియారాలు-6, ఒక జిరాక్స్ యంత్రం, ప్రింటర్ కలిపి మొత్తం 32,721 వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సర్కారు తెలిపింది.
ఇదీ చూడండి: ఆర్టికల్ 370 రద్దుతో ఉగ్రవాదానికి కళ్లెం