'విజయ్ దివస్' సందర్భంగా అమర జవానులకు నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. పాకిస్థాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 16న 'విజయ్ దివస్' జరుపుతున్నారు. నాటి విజయం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు సైన్యం సాహస పరాక్రమాలను ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులతో కలిసి దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ సహా... పలువురు సైనికాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:బంగాల్లో వరుసగా నాలుగో రోజూ 'పౌర' ప్రకంపనలు