ETV Bharat / bharat

'త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానంతో దేశం దిగ్భ్రాంతి'

ఈ ఏడాది తొలి 'మన్​ కీ బాత్ రేడియో' కార్యక్రమంలో ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. గణతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోట ఘటనలో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం చూసి దేశం షాక్​కు గురైంది అన్నారు. 2020 ఏడాది దేశం ఎంతో సంయమనాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించి అనేక సవాళ్లను ఎదుర్కొందని చెప్పారు. కొత్త ఏడాదిలో కూడా అదే తరహాలో ముందుకు సాగాలని మోదీ పిలుపునిచ్చారు

PM Modi to addressed 2021's first Mann Ki Baat
మన్​కీ బాత్​లో మోదీ ప్రసంగం
author img

By

Published : Jan 31, 2021, 11:24 AM IST

Updated : Jan 31, 2021, 12:16 PM IST

రిపబ్లిక్​ డే రోజున దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలో జాతీయ జెండాకు జరిగిన అవమానం చూసి యావత్​ దేశం విస్తుపోయిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ఈ ఏడాది తొలి మన్​ కీ బాత్ రేడియా కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ. ఔషధాలు, వ్యాక్సిన్ల అభివృద్ధిలో భారత్​ స్వయం సమృద్ధి సాధించిందన్నారు.

2020 ఏడాది దేశం ఎంతో సంయమనాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించి అనేక సవాళ్లను ఎదుర్కొందని మోదీ అన్నారు. కొత్త ఏడాదిలో కూడా అదే తరహాలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సంక్షోభ పరిస్ధితుల్లో భారత్‌ ప్రపంచానికే ఆశాజ్యోతిగా మారిందని, కరోనా టీకా పంపిణీ కార్యక్రమమే ఇందుకు నిదర్శనం అని చెప్పారు. 15 రోజుల్లోనే 30లక్షల మందికి టీకా అందించి భారత్‌ రికార్డు సృష్టించిందని తెలిపారు. భారత్‌లో తయారీలో భాగంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌లు దేశ ఆత్మ నిర్భరతకు, ఆత్మ విశ్వాసానికి ప్రతీకలుగా మోదీ అభివర్ణించారు. వ్యవసాయ రంగాన్ని సంస్కరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

చారిత్రక విజయం

ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి​ ​ టీమ్ఇండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసిన విషయాన్ని మన్​కీ బాత్​లో గుర్తు చేశారు మోదీ. సిరీస్​ను ఓటమితో ఆరంభించిన భారత జట్టు.. తిరిగి పుంజుకుని జయకేతనం ఎగురవేసిన తీరు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

ఇదీ చూడండి: ఆసుపత్రి నుంచి శశికళ డిశ్చార్జ్​

Last Updated : Jan 31, 2021, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.