ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​లో బలపరీక్షపై నేడూ కొనసాగనున్న సుప్రీం విచారణ - SC continuous on MLA's verdict

మధ్యప్రదేశ్​లో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. శాసనసభలో బలపరీక్షకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ నేడూ కొనసాగనుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఛాంబర్​లో ప్రవేశపెట్టాలన్న శివరాజ్ సింగ్ చౌహాన్​ ప్రతిపాదనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. బలపరీక్షకు సంబంధించి మరిన్ని వాదనలను నేడు విననుంది.

The Madhya Pradesh Legislative Assembly
మధ్యప్రదేశ్​ శాసనసభ బలపరీక్షపై సుప్రీంలో కొనసాగనున్న విచారణ
author img

By

Published : Mar 19, 2020, 6:01 AM IST

Updated : Mar 19, 2020, 7:02 AM IST

మధ్యప్రదేశ్​ శాసనసభ బలపరీక్షకు సంబంధించి నేడూ సుప్రీంకోర్టులో విచారణ కొనసాగునుంది. రాష్ట్రంలో తిరుగుబాటు(కాంగ్రెస్​) ఎమ్మెల్యేలను న్యాయమూర్తి ఛాంబర్​లో ప్రవేశపెట్టాలన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు శివరాజ్​ సింగ్​ చౌహాన్​ ప్రతిపాదనను కోర్టు తిరస్కరించింది. బలపరీక్ష వ్యాజ్యాలకు సంబంధించి మరిన్ని వాదనలు ఇవాళ కూాడా విననుంది సుప్రీంకోర్టు.

చౌహాన్​ ప్రతిపాదనపై స్పందిస్తూ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్​ ఎదుట హాజరైతే వారి రాజీనామాలపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో తెలపాలని సభాపతి తరఫు న్యాయవాది ఎ.ఎం. సింఘ్వీని న్యాయస్థానం ప్రశ్నించింది. సభాపతి అభిప్రాయాన్ని తెలుసుకొని గురువారం కోర్టుకు చెబుతానని సింఘ్వీ సమాధానమిచ్చారు. మధ్యప్రదేశ్​లో రాజకీయ పరిణామాలపై శివరాజ్​సిగ్​ చౌహాన్​, కాంగ్రెస్​ పార్టీ, స్పీకర్​లు వేరువేరుగా వేసిన పిటిషన్​లపై సుప్రీం న్యాయమూర్తి జస్టిస్​ డి.వై. చంద్రచూడ్​, హేమంత్​ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు విచారణ జరిపింది.

నాటకీయ పరిస్థితులు..

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్​పై ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేసింది భాజపా. రాజ్యసభ ఎన్నికల్లో తనకు ఓటేయాలని బెంగళూరులో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. అంతకుముందు బెంగళూరులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్న బెంగళూరులోని రమదా హోటల్​ ముందు కాంగ్రెస్ నేత దిగ్విజయ్​ ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యేలను కలిసేందుకు ప్రయత్నించగా... పోలీసులు అనుమతి నిరాకరించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం వల్ల చివరకు ఆయనను అదుపులోకి తీసుకొని కాసేపటికి విడుదల చేశారు.

మరోవైపు దిగ్విజయ్ సింగ్​ను కలిసే ఉద్దేశం తమకు లేదని కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. స్వచ్ఛందంగానే రిసార్టులో ఉంటున్నామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: అనిశ్చితిలోనే మధ్యప్రదేశ్​ సర్కార్​-సుప్రీం కీలక వ్యాఖ్యలు

Last Updated : Mar 19, 2020, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.