భారత వైమానిక దళంలో కీలకంగా మారిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానం తొలి మహిళా పైలట్‌గా ఫ్లీట్ లెఫ్టినెంట్ శివాంగి సింగ్ నియమితులయ్యారు. అంబాలా కేంద్రంగా పనిచేసే గోల్డెన్ యారోస్ 17 స్క్వాడ్రన్‌లోకి అడుగుపెట్టనున్న తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.
వారణాసికి చెందిన శివాంగి సింగ్... 2017లో భారత వైమానిక దళంలో చేరారు. మిగ్-21 బైసన్ యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఆమెకు ఉంది. రాజస్థాన్ బోర్డర్ బేస్‌లో అభినందన్ వర్ధమాన్‌తో కలిసి ఫైటర్ జెట్లు నడిపిన శివాంగి.... త్వరలో రఫేల్ స్క్వాడ్రన్‌లో అడుగుపెట్టనున్నారు.
భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రఫేల్ ఫైటర్ జెట్లు తూర్పు లద్ధాక్‌లో కీలకంగా మారాయి.