ETV Bharat / bharat

12 ఏళ్లకు కురవంజీలు విరిసే- కొండాకోనా మురిసే! - western hills

పుష్కర కాలం తర్వాత సొగసైన కురువంజీలు వికసించాయి. పశ్చిమ కనుమల అందాలను మరింత పెంచేశాయి. వంకాయ నీలి వర్ణంతో, మనసును దోచుకునే పరిమళంతో స్వర్గాన్ని తలపిస్తున్న ఈ ప్రాంతం ఇప్పుడు పర్యటకులతో కిటకిటలాడుతోంది.

12 ఏళ్లకు కురవంజిలు విరిసే.. కొండాకోనా మురిసే!
author img

By

Published : Oct 18, 2019, 7:01 AM IST

12 ఏళ్లకు కురవంజీలు విరిసే.. కొండాకోనా మురిసే!
కర్ణాటకలోని పశ్చిమ కనుమలు ఇప్పుడు స్వర్గాన్ని తలపిస్తున్నాయి. 12 ఏళ్లకు ఒక్కసారి పూచే 'కురువంజి' కుసుమాలు ఇక్కడ హొయలుపోతూ వికసిస్తున్నాయి.

అరుదైన అద్భుతం..

కురవంజి.. ప్రకృతి సృష్టించిన ఓ అద్భుతం. గుర్గి హూవుగా కూడా పిలిచే ఈ పువ్వు శాస్త్రీయ నామం.. స్ట్రోబిలాంతెస్ కుంతియానా. పుష్కరానికి ఒక్కసారి మాత్రమే పూచే ఈ పువ్వు.. పచ్చని పర్వత అందాలలో వంకాయ వర్ణంలో వయ్యారాలుపోతుంది.

వర్షం, గాలి, నీరు, కాంతి... అన్నీ సమతుల్య నిష్పత్తిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ పువ్వు వికసిస్తుంది. అందుకే, దేశంలో మరెక్కడా కనిపించని ఈ కుసుమం.. పశ్చిమ కనుమల సున్నితమైన వాతావరణంలో మాత్రమే ఒదిగిపోతుంది. చంద్రద్రోణ, దేవర మానే, చార్ముడి, ఇతర కొండలలో ఇది సాధారణం. గుర్గి పువ్వులలో అనేక రకాలు ఉన్నాయి. అందులో కొన్ని రకాలు 5, 7, 12 ,14 సంవత్సరాలకు ఒకసారి వికసిస్తాయి.

"ఈ పూలు పూచే సమాయానికి నేను ఇక్కడ ఉన్నందుకు నాకు ఎంతో గర్వంగా , సంతోషంగా ఉంది. మహా కుంభమేళా 12 ఏళ్లకు ఒక్కసారి వస్తుంది. అలాగే ఈ పూలు 12 ఏళ్లకు ఓసారి మాత్రమే పూస్తాయి. ప్రతి ఒక్కరు తప్పకుండా చూసి తరించాల్సిన పూలివి. నేను భారత దేశ వ్యాప్తంగా 365 రోజుల పర్యటనకు బయల్దేరాను. ఇప్పటివరకు 9 నెలలైంది. అంతలోనే ఈ కురవంజి పూలను చూసే అవకాశం దక్కింది. ఈ పూలు వికసించే సమయానికి నేను ఇక్కడికి చేరుకోవడం నా అదృష్టం." - పర్యటకుడు.

గుణవంతమైన గుర్గీలు..

కురవంజి పూలలో అనేక ఔషధ గుణాలుంటాయి. అందుకే ఎన్నో వ్యాధుల విరుగుడు మందుల తయారీలో వీటిని ఉపయోగిస్తారు. ఇన్ని సుగుణాలున్న వీటిని అపహరించే వారి సంఖ్యా ఎక్కువే. కానీ పశ్చిమ కనుమలు అటవీ శాఖ ఆధ్యర్యంలో ఉన్నాయి కాబట్టి.. ఈ పువ్వులకు ప్రస్తుతం ఎటువంటి ముప్పు లేదు.

ఈ పువ్వుకు దైవికమైన ప్రాముఖ్యమూ ఉంది. 'వెల్లి' వంశస్థులు.. వారి వివాహ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి మెడలో గుర్గీ పూదండను వేస్తారు. ఈ గుర్గీ.. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రేమ పువ్వుగా ప్రసిద్ధికెక్కింది. అందుకే ఈ ప్రాంతాల్లో కురవంజి వికసించిన వెంటనే సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు.

కొండలకు జీవం వచ్చింది

ఇప్పుడే విచ్చుకుంటున్న కురవంజి పరిమళాలతో చిక్​మంగళూరు, మాల్నాడ్ ప్రాంతంలోని చంద్రద్రోణ పర్వత శ్రేణుల్లో జీవ కళ ఉట్టిపడుతోంది. ఇన్ని రోజులు పచ్చగా ఉన్న కొండ మరో నెల రోజులపాటు వంకాయ రంగులోకి కనిపించనుంది.

ఇదీ చూడండి: ఈ చిన్నారి మాటలకు మోదీ ఫిదా!

Mumbai, Oct 17 (ANI): The classic 1988 song 'So Gya Yeh Jahan', sung by Nitin Mukesh has been recreated for Neil Nitin Mukesh's upcoming movie 'Bypass Road'. Speaking on it, he said, "We were very emotional about the fact that we got this opportunity of working with papa (Nitin Mukesh) on 'So Gya'. It definitely was a dream comes true. Our souls would be crunched completely if we hadn't made papa singing in our home production but somewhere I didn't want the audience to say that 'the brothers are working together and that's why they have their father onboard'. The fact of the matter is that when I was writing the story of 'Bypass Road', any other song was not fitting with the storyline. We have recreated the song in a modern way. So, it is a new version only. We wanted the song to fit the film." 'Bypass Road' is a thriller drama and is directed by Naman Nitin Mukesh, brother of Neil. The movie will hit theaters on November 01.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.