ముంబయి మింట్ రోడ్డులో ఆరు అంతస్తుల భవనంలోని కొంత భాగం కుప్పకూలిన ఘటనలో తొమ్మిది మంది మృత్యు ఒడిలోకి చేరారు. అగ్నిమాపక సిబ్బంది చేపట్టిన సహాయక చర్యల్లో 23 మంది ప్రాణాలతో బయటపడ్డారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.


గురువారం సాయంత్రం 4:45 గంటలకు మింట్ రోడ్డులోని భానుషాలి భవనంలోని 30-40 శాతం భాగం కుప్పకూలింది. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్లే ఈ ఘటన జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:ఆ ఆడియో టేపుల వల్ల కేంద్ర మంత్రికి చిక్కు!