మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని, ముఖ్యమైన పారామితులు స్థిరంగా ఉన్నట్లు శనివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
ప్రణబ్ ముఖర్జీని వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స అందిస్తున్నామని, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు.
మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్‌కు ఈ నెల 10వ తేదీన శస్త్రచికిత్స చేశారు. ఆ సమయంలో జరిపిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.