మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కాన్వాయ్‌పైకి ఓ యువకుడు అకస్మాత్తుగా బైక్‌తో దూసుకొచ్చాడు. సీఎం ప్రయాణిస్తున్న ముందు వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో కాన్వాయ్‌లోని మూడో వాహనంలో ఉన్నారు ముఖ్యమంత్రి.
ఈ ఘటనలో తీవ్రగాయాలైన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అతను ఉద్దేశ పూర్వకంగా చేశాడా లేక అనుకోకుండా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ జరిగింది...
శనివారం మహాజందేశ్ యాత్ర సందర్భంగా షేగావ్‌లోని దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చారు ముఖ్యమంత్రి. అనంతరం తిరుగు ప్రయాణంలో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్‌ను నియంత్రించారు. కానీ ఓ యువకుడు హఠాత్తుగా సీఎం కాన్వాయ్‌పైకి బైక్‌తో దూసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ జరిగింది:విద్యా ప్రమాణాల్లో బిహార్‌తో దిల్లీ పోటీ!