ETV Bharat / bharat

బంగాల్​ దంగల్: ఓవైసీ ఎంట్రీతో దీదీకి పరేషాను? - మమత బెనర్జీ

బంగాల్​లో​ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. పార్టీ ఫిరాయింపులతో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పడు మారుతున్నాయి. అయితే ప్రధానంగా తృణమూల్, భాజపా మధ్య కీలక పోరు నెలకొన్న వేళ బంగాల్​ రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఈ నేపథ్యంలో పదేళ్లుగా మమతకు దన్నుగా నిలిచిన మైనారిటీలు తమ రూటు మార్చుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.

The chemistry of M-factor in the Bengal poll puddle
బంగాల్​ ఎన్నికలు: ఓవైసీ ప్రవేశంతో మమతకు పరేషాను?
author img

By

Published : Feb 5, 2021, 11:03 AM IST

పశ్చిమ్​ బంగాలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం కాకరేపుతోంది. అధికార తృణమూల్​ కాంగ్రెస్ (టీఎంసీ), భారతీయ జనతా పార్టీ (భాజపా) మధ్య ఆరోపణ ప్రత్యారోపణలు, మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ ఫిరాయింపులు, నేతలపై దాడులు, 'జై శ్రీరామ్'​ నినాదాలతో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎంఐఎం నుంచి పలువురు నేతలు టీఎంసీలోకి, తృణమూల్ నుంచి సుమారు 18 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ భాజపాలోకి వలస వెళ్లారు. కాంగ్రెస్​-లెఫ్ట్​ పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ పోటీ ప్రధానంగా టీఎంసీ, భాజపా మధ్యే కనబడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్​, బిహార్ ఎన్నికల్లో జోరు చూపించిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు బంగాల్​పై కన్నేశారు. బంగాల్​లో 30శాతానికి పైగా జనాభాతో 100కు పైగా అసెంబ్లీ స్థానాలను శాసించే ముస్లింలు ఓవైసీకి పట్టం కడతారా? ముస్లిం ఓటు బ్యాంకుతో శాసన పోరు త్రిముఖంగా మారనుందా? లేక మమతను ముంచి భాజపా గెలుపునకు ఓవైసీ పరోక్షంగా దోహదం చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

కొత్త పార్టీతో దోస్తీ!

The chemistry of M-factor in the Bengal poll puddle
అసదుద్దీన్ ఓవైసీ

పశ్చిమ్ ​బంగా రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు ఆల్​ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పటికే జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 44 స్థానాలు, బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలిచి జోరుమీదున్నారు. అదే ఊపును బంగాల్ శాసనసభ​ ఎన్నికల్లోనూ కొనసాగించాలనుకుంటున్నారు. ఆ దిశగా ఇటీవల ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్​ఎఫ్​) పార్టీ పెట్టిన మత ప్రభోధకుడు అబ్బాస్ సిద్దికీతో ఓవైసీ జతకడతారని నిపుణులు భావిస్తున్నారు .

ఐఎస్​ఎఫ్​​ ప్రభావం..

అబ్బాస్ సిద్దికీ

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐఎస్​ఎఫ్​ను ​ స్థాపించారు ఫుర్‌ఫురా షరీఫ్​ అహలే సున్నతుల్​ జమాత్​ వ్యవస్థాపకుడు పిర్జాదా అబ్బాస్​ సిద్దికీ. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. దినాజ్​పుర్, మాల్డా, ముర్షీదాబాద్​లలో సిద్దికీని అనుసరించేవారి సంఖ్య భారీగానే ఉంది. ఆయన లేవనెత్తే అంశాలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం చేసే ప్రయత్నం వల్ల యువతలో మంచి ఆదరణ ఉంది. అయితే మతం కారణంగా లభించిన అభిమానం ఓట్ల రూపంలోకి మారుతుందా అనేది ప్రశ్నార్థకం.

బిహార్​ మ్యాజిక్ రిపీట్​ అవుతుందా?

బిహార్​లో ఎంఐఎం రాత్రికి రాత్రే గెలవలేదు. 2015 నుంచి పార్టీ నేత అఖ్తారుల్ ఇమాన్ నేతృత్వంలో కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చేసిన కృషి కారణంగా విజయం దక్కింది. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకత కారణంగా జేడీయూపై జనాల్లో వ్యతిరేకత నెలకొంది. పైగా అసలు భాజపా గెలిచే అవకాశం లేని స్థానాల్లోనే ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ పోటీ చేసిన 20 స్థానాల్లో దక్కిన ఓట్లు.. ఏ ఒక్క చోటా భాజపా గెలుపునకు దోహదపడలేదు. అయితే ఎంఐఎం కారణంగానే ఆర్జేడీ ఓడిందనే అభిప్రాయం మైనారిటీల్లో నెలకొంది.

పైగా కేంద్రం ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్​ఆర్సీ కారణంగా ఇప్పటికే భాజపాపై ముస్లింలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బంగాల్​లో ఎంఐఎం ఎంట్రీతో ఓట్లు చీలి భాజపా అధికారంలోకి వస్తుందనే భయం మైనారిటీల్లో లేకపోలేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

బిహార్​ తరహాలో బంగాల్​లో కొత్త వ్యక్తులు అంత త్వరగా గెలిచిన దాఖలాలు లేవు. లౌకికవాదానికి పెద్దపీట వేసే బంగాలీలు.. అతివాద ఓవైసీ వైపు చూడటం అనుమానమే.

మరో దారిలేక మమత వెంట!

బంగాల్​ను 3 దశాబ్దాలు పాలించిన లెఫ్ట్​ ప్రభుత్వాన్ని గద్దె దించి 2011లో టీఎంసీ అధికారంలోకి రావడంలో ముస్లింలది కీలకపాత్ర. 30 శాతానికి పైగా జనాభాతో 35 శాతానికి (సుమారు 102) పైగా అసెంబ్లీ స్థానాలను వారు ప్రభావితం చేస్తారు. భాజపాను ఎదుర్కొనేది మమత మాత్రమేననే అభిప్రాయం మైనారిటీల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో మమత పాలనపై అసంతృప్తిగా ఉన్నా.. భాజపా కన్నా మమతే మేలని భావిస్తే వారి ఓట్లు టీఎంసీకే పడే అవకాశం లేకపోలేదు. పైగా మమత.. మైనారిటీ మెప్పు రాజకీయ విధానాలు అవలంబిస్తారనే పేరు కూడా ఉంది.

భాజపాకు ముస్లిం ఓట్లు పడవా?

అమిత్ షా

2016 బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు 10 శాతం ఓట్లు దక్కాయి. 2019 లోక్​సభ ఎన్నికల నాటికి గణనీయంగా 40శాతం ఓట్లు సాధించింది. అయితే అది లెఫ్ట్​, కాంగ్రెస్​, తృణమూల్​లపై వ్యతిరేకత కారణంగా వచ్చిందా, భాజపా సొంత బలంపై వచ్చిందా అనేది ఆలోచించాల్సిన విషయం.

ఆ సమయంలో హిందూ ఓట్లను సమీకరించడంలో భాజపా విజయవంతమైంది. సుమారు కోటి మంది లెఫ్ట్​ ఓటర్లు ఆ పార్టీలో చేరినట్లు అంచనా. ఈ కారణంగా అద్వితీయంగా 2019లో 18 లోక్​సభ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే భాజపాకు ముస్లింలు ఓటు వేయరు అనే భావన సరికాదని ఈ ఎన్నికలు నిరూపిస్తున్నాయి. దక్షిణ మాల్డాలో 64 శాతం ముస్లిం ఓటర్లు ఉంటే భాజపాకు 34శాతం ఓట్లు లభించాయి. జంగీపుర్​లో 82 శాతం ముస్లిం ఓట్లర్లు ఉండగా, భాజపాకు 24 శాతం పడ్డాయి. ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా మైనారిటీలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది భాజపా.

294 అసెంబ్లీ స్థానాలు కలిగిన బంగాల్​లో ఈ ఏడాది ఏప్రిల్​ లేదా మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: టీఎంసీ నేతల చేరికలకు భాజపా బ్రేకులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.