బ్యాంకుల కన్సార్టియాన్ని 3 వేల 592 కోట్ల రూపాయల మేర మోసగించారన్న ఆరోపణలపై... ముంబయికి చెందిన ఫ్రోస్ట్ ఇంటర్నేషనల్ సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ఫిర్యాదు మేరకు డైరెక్టర్లు ఉదయ్ దేశాయ్, సుజయ్ దేశాయ్‌తో పాటు మరో 11 మంది వ్యక్తులు, సంస్థలపై సీబీఐ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టింది. బ్యాంకులకు అప్పు ఎగవేయడం సహా సంస్థ డైరెక్టర్లు, పూచీదారులు నకిలీపత్రాలు సమర్పించి రుణాలు తీసుకున్నారని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసులు నమోదు చేసింది.
ఇదీ చూడండి : రూ.100 కోట్లు విలువైన హెరాయిన్ సీజ్- ఇద్దరు అరెస్ట్