ETV Bharat / bharat

నమస్తే ట్రంప్​: అధ్యక్షుడి కారు 'ద బీస్ట్​'లో ప్రత్యేకతలెన్నో.. - నమస్తే ట్రంప్

ఈనెల 24న భారత పర్యటనకు రానున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఆయన ప్రయాణించే కారు ఇప్పటికే అహ్మదాబాద్​ చేరుకుంది. 'ద బీస్ట్​'గా పిలిచే ఈ కారు ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. బులెట్​ ప్రూఫ్​ సహా విలాసవంతమైన ఆ కారు విశేషాలు తెలుసుకుందాం.

The car for President
నమస్తే ట్రంప్​
author img

By

Published : Feb 20, 2020, 6:18 AM IST

Updated : Mar 1, 2020, 10:09 PM IST

'ద బీస్ట్​'... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారు. పేరుకు తగినట్టే అత్యంత శక్తిమంతమైనది ఆ వాహనం. భద్రతాపరంగా శత్రుదుర్బేధ్యమైనది. సౌకర్యాలపరంగా ఎంతో విలాసవంతమైనది.

ప్రఖ్యాత జనరల్​ మోటర్స్​ అనుబంధ సంస్థ అయిన క్యాడిలాక్​... అధ్యక్షుడి ప్రత్యేక కారును తయారు చేస్తుంది. ఈనెల 24న భారత పర్యటనకు ట్రంప్​ రానున్న సందర్భంగా ఇప్పటికే ప్రత్యేక విమానంలో భద్రతా సిబ్బంది సహా అధ్యక్షుడు ప్రయాణించే కారు గుజరాత్​లోని అహ్మదాబాద్​కు చేరుకుంది.

The car for President
అధ్యక్షుడి కారు 'ద బీస్ట్​'లో ప్రత్యేకతలెన్నో..

'ద బీస్ట్'​ విశేషాలు:

  1. బోయింగ్​ 757 విమానానికి ఉండే డోర్లు వంటివి 'ద బీస్ట్​' కారుకు ఉంటాయి. వాటిలో ఆయుధాలు అమర్చి ఉంటాయి. గ్యాస్​, రసాయనాలు లోపలకు వెళ్లలేనంత పటిష్ఠంగా మూసుకొంటాయి.
  2. కారును నడిపే డ్రైవర్​.. ఎప్పుడూ సీక్రెట్​ సర్వీస్ ఏజెంట్​ మాత్రమే ఉంటాడు. విపత్కర పరిస్థితుల్లో కారు ఏ వింధంగా నడపాలో ముందే శిక్షణ పొందుతాడు. ఒక్కసారిగా 180 డిగ్రీల కోణంలోనూ తిరగడం ఈ కారు ప్రత్యేకత.
  3. డ్రైవర్ కంపార్ట్​మెంట్​లో జీపీఎస్​ ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది. అది సమాచార కేంద్రానికి అనుసంధానమై ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తుంది.
  4. కారు బాడీ మొత్తం ఉక్కు, అల్యూమినియం, టైటానియం, సిరామిక్స్​ మిశ్రమంతో తయారు చేస్తారు. బాంబ్​ పేలుళ్లనూ తట్టుకునే శక్తి ఈ కారుకు ఉంది.
  5. ఈ కారు టైర్లను ఉక్కు కలిపి ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఏ పరిస్థితుల్లోనూ పంక్చర్​ కాదు. ఎప్పుడైనా ​టైర్​ పేలిపోయినప్పటికీ రిమ్​తోనూ కారు నడవగలుగుతుంది.
  6. అధ్యక్షుడి రక్త నమూనాకు సరిపోయే బ్లడ్​ బ్యాగ్స్​ కారులో అందుబాటులో ఉంచుతారు. చిన్నపాటి తుపాకులు, బాష్పవాయువు గోళాలు వంటివి ఉంటాయి.
  7. డీజిల్​ ట్యాంకుకు ప్రత్యేకంగా తయారు చేసిన కవచం ఉంటుంది. అది ఏ పరిస్థితుల్లోనూ పేలదు. దాని లోపల నురగ వంటి రసాయనాలు ఉంటాయి. అవి మంటలు అంటుకోకుండా చూస్తాయి.
  8. అధ్యక్షుడు కూర్చునే సీటు వద్ద శాటిలైట్​ ఫోన్​ ఉంటుంది. దాని ద్వారా నేరుగా అమెరికా రక్షణ వ్యవస్థ పెంటగాన్​, ఉపాధ్యక్షుడితో మాట్లాడవచ్చు.
  9. కారులో అగ్నిమాపక​ వ్యవస్థ ఉంటుంది. అందులో బాష్పవాయువు, పొగను తొలగించే పరికరాలు ఉంటాయి.
  10. అధ్యక్షుడు, ఇతర ప్రయాణికుల మధ్య క్లాస్​ కంపార్ట్​మెంట్​ సౌకర్యం ఉంది. దానిని అధ్యక్షుడు మాత్రమే ఆపరేట్​ చేయగలుగుతారు. అందులో పానిక్​ బటన్​, ఆక్సిజన్​ సరఫరాకు ఏర్పాట్లు ఉన్నాయి.

భారీ భద్రతా, నిఘా వ్యవస్థల మధ్య అధ్యక్షుడి పర్యటన సాగుతుంది. గడిచిన 3 దశాబ్దాల కాలంలో అధ్యక్షుడి కారుపై ఎలాంటి దాడి జరగలేదు. కానీ అంతకు ముందు 7 సార్లు దాడులు జరిగాయి. 1829-1989 వరకు జరిగిన దాడుల్లో ఏడుగురు అధ్యక్షులు గాయపడ్డారు. ఐదుగురు అధ్యక్షులు ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల అధ్యక్షుడి​ భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇదీ చూడండి: నమస్తే ట్రంప్​: యుద్ధ మేఘాల నుంచి స్నేహగీతాల వరకు...

Last Updated : Mar 1, 2020, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.