ETV Bharat / bharat

'విద్యా సంవత్సరం వృథా కాదు.. పరీక్షలు నిర్వహిస్తాం' - online class news

ఈ విద్యా సంవత్సరాన్ని వృథాగా పోనివ్వమని... పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ చివర్లో లేదా.. అక్టోబర్‌లో ఆరంభించాలని భావిస్తున్నారు. దీనిపై నిర్ణయం మాత్రం తీసుకోలేదు.

The academic year has come to an end as 'Zero Year' and examinations will be held: Center
'విద్యా సంవత్సరం వృథా కాదు.. పరీక్షలు నిర్వహిస్తాం'
author img

By

Published : Aug 11, 2020, 7:45 AM IST

ప్రస్తుత విద్యా సంవత్సరం 'జీరో ఇయర్‌'గా ముగియదని, పరీక్షలు జరుపుతామని పార్లమెంటరీ సంఘం ముందు కేంద్ర విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తంచేశారు. విద్యాసంవత్సరం చివర్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌ క్లాసులు కూడా మూడో తరగతి దాటిన వారికి మాత్రమేనని, ఎనిమిదో తరగతి వరకు వాటి సంఖ్యను కూడా పరిమితం చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు.. చరవాణులు, ల్యాప్‌ట్యాప్‌లు, కంపూటర్లు లేని బీద విద్యార్థుల సంగతేంటని ప్రశ్నించారు. వారికి విద్య ఎలా అందిస్తున్నారని అడిగారు. చరవాణులు కంటే కమ్యూనిటీ రేడియో, ట్రాన్సిస్టర్‌ ద్వారా విద్యా ప్రసారాలు చేస్తే ఎక్కువ మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని పార్లమెంటీ సంఘం ఛైర్మన్‌ వినయ్‌ సహస్రబుద్ధి అన్నారు.

కేంద్రం మల్లగుల్లాలు

పాఠశాలలు ఎప్పుడు తెరవాలన్న అంశంపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. కరోనా వైరస్‌ కారణంగా దేశ వ్యాప్తంగా విద్యాలయాలు మార్చి 16 నుంచి మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో తిరిగి ప్రారంభించే విషయంలో కేంద్ర విద్యాశాఖ అధికారులు రకరకాల ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్‌ చివర్లో లేదా.. అక్టోబర్‌లో ఆరంభించాలని భావిస్తున్నారు. దీనిపై నిర్ణయం మాత్రం తీసుకోలేదు.

ఇదీ చూడండి: 'వైద్యుల క్వారంటైన్‌ కాలాన్ని ఆన్​డ్యూటీగానే పరిగణించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.