ETV Bharat / bharat

ఆ చట్ట సవరణతో తల్లీ బిడ్డ న్యాయం..! - pregnant

దేశవ్యాప్తంగా స్త్రీ వైద్యనిపుణులు చేసిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని వైద్యపరమైన గర్భవిచ్ఛిత్తి చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. మంత్రిమండలి ఆమోదంతో చట్ట సవరణ ప్రక్రియ ప్రారంభమైంది? అయితే ఎందుకీ సవరణలు? దీనివల్ల ఊరట ఎవరికి? దీనిపై గైనకాలజిస్టుల అభిప్రాయాలేంటి? అవేంటో తెలుసుకుందాం?

pregnant
తల్లీబిడ్డ న్యాయం.. అస్వస్థ పిండాన్ని 6 నెలల్లోనూ తొలగించే అవకాశం
author img

By

Published : Feb 12, 2020, 1:19 PM IST

Updated : Mar 1, 2020, 2:09 AM IST

ఆమె 20 వారాల గర్భిణి.. కడుపులో శిశువుకు గుండె సంబంధ సమస్య ఉన్నట్లుగా స్కానింగ్‌లో నిర్ధారణయింది. బిడ్డ పుట్టినా బతికే అవకాశాల్లేవని తేలింది. గర్భస్రావం చేయించుకోవాలని వైద్యురాలిని సంప్రదిస్తే.. ఐదు నెలలు దాటాక చట్టం అంగీకరించదని నిస్సహాయతను వ్యక్తంచేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తేగానీ సాధ్యంకాలేదు.

అలాగే వసతిగృహంలో చదువుకుంటున్న 14 ఏళ్ల బాలిక ఓ కామాంధుడి మాయమాటలకు మోసపోయి గర్భం దాల్చింది. విషయాన్ని 20 వారాలు గడిచాక గానీ ఇంట్లో గుర్తించలేకపోయారు. అప్పుడు గర్భస్రావానికి వైద్యులు నిరాకరించారు. ఇక్కడ కూడా న్యాయస్థానం జోక్యం చేసుకొని అంగీకారం తెలిపింది.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా స్త్రీ వైద్యనిపుణులు చేసిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని వైద్యపరమైన గర్భవిచ్ఛిత్తి చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. గర్భం దాల్చడాన్ని వివాహిత ఎంతో అపురూపంగా భావిస్తుంది. గర్భస్రావ ప్రస్తావననే ఆమె ఇష్టపడదు. తల్లికి గానీ, బిడ్డకు గానీ ముప్పు ఉందని తేలినప్పుడు.. తప్పనిసరైతే ఆరో నెలలోనూ గర్భవిచ్ఛిత్తికి త్వరలో అవకాశం లభించబోతోంది. దీనికి సంబంధించిన చట్టాన్ని సవరించేందుకు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన అనంతరం అమల్లోకి వస్తుంది. ఇప్పటి వరకూ ఐదు నెలలలోపే ఇందుకు అవకాశం ఉంది. దీన్ని అవకాశంగా మలచుకొని కొందరు గర్భస్రావం చేయించుకునే దుర్మార్గపు వ్యవహారాలకు వీలుండడం వల్ల చట్టంలో తగిన కట్టుబాట్లు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకీ సవరణ?

సాధారణంగా 11-14 వారాల్లో చేసే స్కాన్‌లో గర్భస్థ శిశువు వెన్నుపూస, మెదడులో లోపాలుంటే తెలుస్తుంది. మెదడు వెనుక ఉండే భాగంలో వాపు మాదిరిగా ఉంటే.. జన్యుపరమైన, గుండె సంబంధిత సమస్యలుండే అవకాశాలుంటాయి.

మరో రక్త పరీక్ష ద్వారా కూడా వీటిని నిర్ధారిస్తారు.

కొన్నిసార్లు ఈ సమస్యలు 16-20 వారాల్లో జరిపే పరీక్షల్లో బయటపడతాయి. అప్పుడు నిర్ధారణ కోసం మరికొన్ని పరీక్షలను చేయాల్సి వస్తుంది. ఈ ఫలితాలు రావడానికి కనీసం నాలుగు వారాలు పట్టొచ్చు.

ఉదాహరణకు 18 వారాలప్పుడు స్కానింగ్‌లో ప్రాథమికంగా జన్యుపరమైన సమస్యలున్నట్లుగా గుర్తించి, ఆమినోసింథసిస్‌ పరీక్షకు పంపిస్తే.. 22 వారాలొచ్చేసరికి గానీ ఫలితాలు రావు. అప్పుడు సమస్య ఉన్నట్లుగా నిర్ధారణ అయితే గర్భస్రావం చేయడానికి ప్రస్తుతమున్న చట్టం అంగీకరించదు.

దీనివల్ల ఆ కుటుంబాల్లో వేదన, ఆందోళన... ఈ క్రమంలో మానసిక ఒత్తిడితో తల్లి ఆరోగ్యంపైనా దుష్ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

వైద్య నిపుణుల మాట

"స్వాగతించదగ్గ పరిణామం. గర్భవిచ్ఛిత్తి తప్పదనే నిర్ణయాధికారాన్ని ఇద్దరు వైద్యులు తీసుకోవాలనీ, అందులోనూ ఒక ప్రభుత్వ వైద్యుడు ఉండాలని నిబంధనల్లో పొందుపర్చడం సరైందే. ఈ సవరణ వల్ల ఎక్కువ ప్రయోజనాలున్నా కొంత దుర్వినియోగం కూడా ఉంటుంది. గర్భవిచ్ఛిత్తి తరువాత ఆ శిశువుకు శవపరీక్ష జరిపించాలనే నిబంధనను బిల్లులో పొందుపర్చాలి."

- బాలాంబ, గైనకాలజిస్ట్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళలకు మేలు చేసేదే. ఆరోగ్యకరమైన శిశువును పొందే హక్కును మహిళలు పొందుతారు. అత్యాచారానికి గురై గర్భం దాల్చి, ఆలస్యంగా గుర్తించినవారికి ఊరట లభిస్తుంది.

- జయంతీరెడ్డి, గైనకాలజిస్ట్‌

ఇదీ చూడండి: జీరో ఎఫెక్ట్​: దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా

ZCZC
PRI GEN LGL NAT
.NEWDELHI LGD5
SC-ABDULLAH
SC judge recuses from hearing plea challenging Omar Abdullah's detention
         New Delhi, Feb 12 (PTI) Supreme Court judge Justice M M Shantanagoudar on Wednesday recused himself from hearing the plea filed by Sara Abdulla Pilot challenging detention of her brother and NC leader Omar Abdullah under the J-K Public Safety Act.
          Pilot's plea came up for hearing before a three-judge bench comprising justices N V Ramana, Shantanagoudar and Sanjiv Khanna.
          "I am not participating in this matter," Justice Shantanagoudar said at the outset.
          The bench said the plea could be heard on Thursday. PTI ABA MNL RKS LLP LLP
DV
DV
02121059
NNNN
Last Updated : Mar 1, 2020, 2:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.