జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భాజపా నాయకుడు, సర్పంచ్ సజ్జాద్ అహ్మద్ ఖాండేను తీవ్రవాదులు కాల్చి చంపారు. క్వాజిగుండ్ ప్రాంతంలోని వెస్సులో సజ్జాద్ ఇంటి సమీపంలోనే ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
స్థానికులు హుటాహుటిన సర్పంచ్‌ను.. అనంత్ నాగ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుల్గాం జిల్లాలో భాజపా అనుబంధ పంచాయతీ సభ్యుడిని కాల్చిన 48 గంటల్లోనే మరో భాజపా నేతపై దాడి జరగడం కలకలం రేపింది. పంచాయతీ సభ్యుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.