2013 బోధ్‌గయ పేలుడు కేసు ప్రధాన నిందితుడు షేక్ అసదుల్లాను చెన్నైలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు జమాత్-ఉల్-ముజాహిదీన్ ఉగ్రసంస్థకు చెందిన వాడిగా అధికారులు అనుమానిస్తున్నారు.
బిహార్‌లోని బోధ్‌గయలో జరిగిన పేలుడు ఘటనలో ఇద్దరు బౌద్ధ సాధువులు సహా ఐదుగురు మృతిచెందారు. పేలుడుకు సంబంధించి ఐదుగురు ఉగ్రవాదులను గతంలో ఎన్ఐఏ అరెస్టు చేసింది. కేసును విచారించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు.. వారికి జీవిత ఖైదు విధించింది. అనంతరం పేలుడుకు సంబంధించిన మరికొందరిని పట్టుకోవడానకి బిహార్ పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు.
తాజాగా మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా అసదుల్లా చెన్నైలో ఉన్నట్టు గుర్తించారు. సోమవారం రాత్రి చెన్నై చేరుకున్న అధికారులు.. నీలకరై పోలీసుల సహాయంతో అసదుల్లాను పట్టుకున్నారు.
ఇదీ చూడండి:- 'విక్రమ్' కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న ఇస్రో