ETV Bharat / bharat

'నగ్రోటా ఉగ్రదాడి.. ఆ సంస్థ ప్రణాళిక ప్రకారమే'

జమ్ముకశ్మీర్​లో జరిగిన నగ్రోటా ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి పాకిస్థాన్​ ఐఎస్​ఐ అని ప్రభుత్వ ఉన్నత వర్గాలు వెల్లడించాయి. బావల్​పుర్​లో ఉగ్రవాద ఈ ప్రణాళికను రూపొందిచినట్లు తేల్చాయి. కశ్మీర్​లో ఎన్నికలు జరుగనున్న ఎన్నికలే లక్ష్యంగా దాడులు జరిపినట్లు నిర్ధరించాయి.

author img

By

Published : Nov 21, 2020, 7:19 PM IST

terrorist-masood-azhars-brother-was-handler-of-4-jaish-suicide-attackers-killed-in-nagrota-encounter
'నగ్రోటా ఉగ్రదాడి.. ఆ సంస్థ ప్రణాళిక ప్రకారమే'

నగ్రోటా ఉగ్రదాడి అంతా పాకిస్తాన్‌ ఐఎస్​ఐ ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాలు వెల్లడించాయి. బావల్‌పుర్‌లో జరిగిన భేటీలో దాడికి రూపకల్పన చేసినట్లు వెల్లడించిన ఉన్నతవర్గాలు.. ఈ భేటీకి ఉగ్రవాద నేతలు అబ్దుల్ రౌఫ్, అబూ జుండాల్, అష్గర్ ఖాన్ సహా ఇతర జైష్ ఇ మహమ్మద్‌ కమాండర్లు హాజరయ్యారని తెలిపాయి.

ఐఎస్​ఐ ఈ దాడిని జైష్‌ ద్వారా ప్లాన్ చేసిందని స్పష్టం చేశాయి. స్వాధీనం చేసుకున్న అన్ని ఆయుధాలు పుల్వామాలో ఉపయోగించిన ఆయుధాలను పోలి ఉన్నట్లు గుర్తించారు. కశ్మీర్‌లో రాజకీయ నేతలను హతమార్చడం, ఎన్నికలను ప్రభావితం చేసే లక్ష్యంతో దాడికి పూనుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

సీసీకెమెరాల్లో ఆధారాలు

చిమ్మ చీకట్లు ఉన్న సమయంలో ఉగ్రవాదులు అదను చూసి సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. షకర్‌నగర్‌లో ఉన్న జైష్‌ క్యాంప్ మొత్తం వ్యవహారానికి కేంద్రంగా గుర్తించినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దుకు ఈ క్యాంపు 30 కిలో మీటర్ల పరిధిలో ఉండటం, 8 కిలోమీటర్ల పరిధిలో పికప్‌ పాయింట్లు పెట్టినట్లు సమాచారం. దాడికి వచ్చిన ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఏకే-47లలో ఒక దానిపై జైష్‌ పేరు రాసి ఉన్నట్లు ఉన్నత వర్గాలు స్పష్టం చేశాయి. జాతీయ రహదారిపై ఉన్న సీసీకెమెరాల్లో పలు ఆధారాలు బయటపడ్డాయని, రికార్డయిన వీడియోలు ప్రస్తుతం భద్రతా సంస్థల సంరక్షణలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

స్వాధీనం చేసుకున్న పరికరాలు

terrorist-masood-azhars-brother-was-handler-of-4-jaish-suicide-attackers-killed-in-nagrota-encounter
ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పరికరాలు

నగ్రోటా టెర్రరిస్టుల నుంచి పాకిస్థాన్‌లో తయారైన మొబైల్‌ ఫోన్లు, జీపీఎస్, వైర్‌లెస్ సెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించాయి. పాకిస్థాన్‌ ఔషధాలు, దెబ్బలు తగిలినా నొప్పి తెలియకుండా ఉండేందుకు పెయిన్ కిల్లర్‌లు, ఇంజెక్షన్‌లు కూడా ఉగ్రవాదులు తమతో తెచ్చుకున్నట్లు పేర్కొన్నాయి. వీటితో పాటు అంతర్జాతీయ సరిహద్దు నుంచి పికప్ పాయింట్ దూరం చూపించే మ్యాప్‌లను కూడా ఉగ్రవాదులకు అందించినట్లు గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.