జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
జిల్లాలోని కలకోటే ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్లు వచ్చిన సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టాయి బలగాలు. సైనికులను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఇరువర్గాల మధ్య జరిగిన పోరులో ఒక తీవ్రవాదిని మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు.
మట్టుబెట్టిన ఉగ్రవాది నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు రాజౌరీ-పూంచ్ ప్రాంత డీఐజీ వివేక్ గుప్తా తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని భద్రతా దళాలు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ భారీ సాయం