భారత్ మహమ్మారిపై యుద్ధంలో నిమగ్నమైన వేళ.. దేశంలో సులభంగా దాడులకు పాల్పడవచ్చన్న తప్పుడు అభిప్రాయాల్లో ఉగ్రవాదులు ఉన్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. భారత్ ఏకకాలంలో కరోనా వైరస్‌తో పాటు ఉగ్రవాదంతోనూ పోరాడి విజయం సాధించగలదని పేర్కొన్నారు.
సరిహద్దుల నుంచి ముష్కరులను దాటించడం సహా సామాజిక మాధ్యమాల ద్వారా దేశంలో ఓ వర్గం వివక్షకు గురవుతోందంటూ.. అసత్య ప్రచారాలు చేస్తోందని పరోక్షంగా పాకిస్థాన్‌పై విమర్శలు గుప్పించారు వెంకయ్య. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ముస్లింల అభివృద్ధి కోసం చేపట్టనన్ని కార్యక్రమాలు భారత ప్రభుత్వం చేపడుతోందని గుర్తు చేశారు. తమ దేశ పౌరులను ఎలా చూసుకోవాలో ఇంకెవరితోనో పాఠాలు చెప్పంచుకునే దుర్గతి భారత్‌కు పట్టలేదని ఆయన ఫేస్బుక్ పోస్టు ద్వారా తెలిపారు. ప్రపంచం మొత్తం కరోనాతో పాటు ఉగ్రవాదాన్ని కూడా తుదముట్టించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: ఆ వీరపత్ని కన్నీటికి అర్థమేంటి.?