తమిళనాడు చెన్నెలోని విల్లివక్కమ్ ప్రాంతంలో ఇన్నోవా కారు బిభత్సం సృష్టించింది. ముగ్గురిపైకి దూసుకెళ్లి స్థానికులను భయానికి గురిచేసింది. మద్యం మత్తులో కారు నడిపిన ఓ వ్యక్తి ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాడు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
మృతులు సరస(60), మోహన్(47)లుగా అధికారులు గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ ఆది లక్ష్మీ(50) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదానికి కారణమైన కారును స్థానికులు వెంబడించారు. కారులో ఉన్న ఇద్దరిలో ఒకరు తప్పించుకుని పారిపోగా.. డ్రైవర్ దేవేద్రన్ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దేవేద్రన్ అతిగా మద్యం చేవించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఇదీ చూడండి: "అమేఠీ ప్రజలకు రాహుల్ భావోద్వేగ లేఖ"