ఒడిశాలోని నవరంగ్పుర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుమండలి గ్రామంలో రక్తసిక్తమైన ఓ బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించడం కలకలం రేపింది. ఆ మైనర్ శరీరంపై గాయాలు, ఘటనాస్థలంలోని పరిస్థితులను గమనిస్తే... హైదరాబాద్ పశువైద్యురాలు దిశ హత్యాచార ఉదంతంలాగే ఉందని స్థానికులు అంటున్నారు.
ఏం జరిగింది?
గ్రామంలోని పొలంలో ఓ బాలిక మృతదేహాం కనిపించింది. ఆ మైనర్పై అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేసినట్టు అర్థమవుతోంది.
ఘటనా స్థలానికి 300 మీటర్ల దూరంలోనే ఆ బాలిక నివాసం ఉంది. ఈ ఇంటి నుంచే ఆమెను బలవంతగా తీసుకొచ్చి.. పొలంలో ఆఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన గుర్తులు కూడా లభించాయి. బాలిక శరీరంపై గాయాలున్నాయి.
ఈ ఘాతుకానికి పాల్పడిన వారి వివరాలపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. అయితే మృతదేహానికి కొద్ది దూరంలో రెండు ప్యాంట్లు పడి ఉన్నాయి. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.