అసోం, మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో చాలా మంది గాయపడ్డారు. మిజోరంలోని కొలాసిబ్, అసోంలోని కాచర్ జిల్లా సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై అసోం సీఎం సర్బానంద సోనోవాల్, మిజోరం సీఎం జోరామ్‌థంగా ఫోన్ ద్వారా మాట్లాడారు. సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణకు అంగీకరించారు. ఫలితంగా ఆ ప్రాంతంలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.
ఫోన్ సంభాషణ..
ఈ విషయమై ప్రధాని, కేంద్ర హోంమంత్రి కార్యాలయానికి తెలియజేసినట్లు సోనోవాల్ తెలిపారు.
"అసోం, మిజోరం సరిహద్దు వద్ద జరిగిన ఘటనపై జోరామ్థంగాతో ఫోన్లో సంభాషించాను. ఆ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణకు ఇరువురమూ అంగీకరించాం. రాష్ట్రాల మధ్య సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించాం. ఈ విషయాన్ని కేంద్రానికి విన్నవించాం."
- సర్బానంద సోనోవాల్, అసోం ముఖ్యమంత్రి
అల్లర్ల నేపథ్యంలో అసోం, మిజోరం రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా ఇవాళ సమావేశం కానున్నారు.
సరిహద్దు ఉద్రిక్తతలపై తక్షణం స్పందించినందుకు సోనోవాల్‌కు జోరామ్‌థంగా కృతజ్ఞతలు తెలిపారు.
-
Currently in an emergent Cabinet Meeting to discuss the recent #borderconflict between #Mizoram and #Assam.
— Zoramthanga (@ZoramthangaCM) October 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
I sincerely request everyone to maintain peace and to kindly not bypass any administrative proceedings.@AmitShah @narendramodi @sarbanandsonwal @himantabiswa pic.twitter.com/JlDPT4hcDy
">Currently in an emergent Cabinet Meeting to discuss the recent #borderconflict between #Mizoram and #Assam.
— Zoramthanga (@ZoramthangaCM) October 18, 2020
I sincerely request everyone to maintain peace and to kindly not bypass any administrative proceedings.@AmitShah @narendramodi @sarbanandsonwal @himantabiswa pic.twitter.com/JlDPT4hcDyCurrently in an emergent Cabinet Meeting to discuss the recent #borderconflict between #Mizoram and #Assam.
— Zoramthanga (@ZoramthangaCM) October 18, 2020
I sincerely request everyone to maintain peace and to kindly not bypass any administrative proceedings.@AmitShah @narendramodi @sarbanandsonwal @himantabiswa pic.twitter.com/JlDPT4hcDy
ఏం జరిగింది?
వెదురు చెట్లను నరికే విషయంలో అసోం, మిజోరం సరిహద్దుల్లో ఇరు రాష్ట్ర వాసుల మధ్య ఘర్షణ తలెత్తింది. మిజోరంలోని కొలైసిబ్‌జిల్లా, అసోంలోని కాచర్‌జిల్లాలోని సరిహద్దుల్లో ఈ ఘర్షణలు తలెత్తాయి. ఆందోళనకారులు పలు గుడిసెలకు నిప్పంటించారు. ఇరు రాష్ట్ర వాసులు పరస్పరం దాడులు చేసుకోగా పలువురు గాయపడ్డారు.
ఘర్షణలను అదుపు చేసేందుకు ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసులు సరిహద్దుల్లో భారీగా మోహరించారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
ఇదీ చూడండి: గుడ్డు కూర పెట్టలేదని మిత్రుడి హత్య