ETV Bharat / bharat

బిహార్​ బరి: 'బ్రాండ్​ తేజస్వీ'తోనే ఎన్​డీఏ పోరు!

'సమోసాలో ఆలూ, బిహార్​లో లాలూ' ఇది పాత ముచ్చట. లాలూ జైలుకెళ్లిన తర్వాత సీన్​ మారింది. తెరపైకి తేజస్వీ వచ్చాక ఆర్​జేడీ లాంతర్​ ఒక వెలుగు వెలుగుతోంది. ఇప్పుడు​ ఎన్​డీఏ నేతల బిహార్​ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ విన్నా 'తేజస్వీ' మాటే. మరి 'తేజస్వీ బ్రాండ్' ఇమేజ్.. బిహార్​ సీఎం పీఠాన్ని తెచ్చిపెడుతుందా? నితీశ్​ను ఎదుర్కొని నిలబడుతుందా?

Tejashwi's
బిహార్​ బరి: బ్రాండ్​ తేజస్వీ x ఎన్​డీఏ
author img

By

Published : Oct 25, 2020, 5:40 PM IST

Updated : Oct 25, 2020, 5:45 PM IST

రాజకీయాల్లో తలపండిన ఎన్​డీఏ దిగ్గజ నేతలు ఓవైపు.. వాళ్ల అనుభవమంత వయసు కూడా లేని 30 ఏళ్ల యువనేత మరోవైపు. ఇది బిహార్ ఎన్నికల బరిలో తాజా ముఖచిత్రం. సింపుల్​గా చెప్పాలంటే ప్రస్తుతం బిహార్​ రాజకీయం తేజస్వీ చుట్టూనే తిరుగుతోంది.

యువరక్తం...

తేజస్వీ యాదవ్​... లాలూ తర్వాత ఆర్‌‌జేడీ లాంతర్ పట్టుకునే వాళ్లెవరా అని బిహార్‌‌లో జనం ఎదురుచూస్తున్న దశలో ముందుకొచ్చారు. మోదీ మేనియా, నితీశ్​ విమర్శలను దీటుగా ఎదుర్కొంటూ పార్టీని ఎన్నికల రేసులో నిలిపారు. తన తండ్రి లాలూ ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో లేని లోటును భర్తీ చేసేందుకు ఈ యువ నేత శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే తేజస్వీ రానున్న రోజుల్లో ఓ విశ్వసనీయ నేతగా ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జాతీయ స్థాయిలో మోదీకి ఉన్న ఇమేజ్​ తెలియనిది కాదు. అయితే బిహార్​లో ప్రస్తుతం తేజస్వీ యాదవ్ అదే స్థాయి ఇమేజ్​ను సంపాదించారు. ఎందుకంటే ఇప్పుడు బిహార్​ రాజకీయం అంతా 'తేజస్వీ x మిగిలిన నేతలు'గా నడుస్తోంది.​

2014 సీన్...

ప్రస్తుత బిహార్ రాజకీయం 2014లో జాతీయ స్థాయి రాజకీయాలను గుర్తుకు తెస్తోంది. అందుకు కారణం లేకపోలేదు.

యూపీఏ-2 ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, బయటపడ్డ కుంభకోణాలతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ సమయంలో నరేంద్ర మోదీ సుపరిపాలన, అవినీతి రహిత పాలన గురించి చెప్పడం ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్లింది. అదే భాజపా అనుకూల పవనాలు బలంగా వీచేలా చేసింది.

అయితే ఆ లోక్​సభ ఎన్నికలకు ముందే 2012 నుంచి మోదీ మాట్లాడిన ప్రతిసారి అప్పటి ప్రధాని మన్మోహన్​ తప్ప యూపీఏ నేతలందరూ ఆయనపై మాటల దాడికి దిగేవారు. గోద్రా అల్లర్లు, సతీమణిని మోదీ దూరంగా పెట్టారంటూ ఆయనపై వ్యక్తిగత విమర్శలకు సైతం వెనుకాడ లేదు.

అదే రీతిలో...

2014 లోక్​సభ ఎన్నికలు మొత్తం మోదీ చుట్టూ ఎలా తిరిగాయో ఇప్పుడు 2020 బిహార్​ శాసనసభ సమరం తేజస్వీ చుట్టూ తిరుగుతోంది. మోదీ నుంచి నితీశ్​ వరకు ఎన్​డీఏ నేతలందరూ తేజస్వీ పేరు లేకుండా ప్రసంగాన్ని పూర్తి చేయడం లేదు. తేజస్వీ చేసే విమర్శలపై ప్రతిదాడి చేస్తున్నారు. ఫలితంగా... అప్పటి వరకు ఎన్​డీఏ నేతలకు విమర్శనాంశాలుగా ఉన్న లాలూ కుంభకోణాలు సహా ఇతర విషయాలు మరుగున పడిపోయాయి. తేజస్వీపై వ్యక్తిగత విమర్శలు చేసేందుకే నేతలు మొగ్గు చూపుతున్నారు. వ్యక్తిగత విషయాల జోలికి ఎప్పుడూ వెళ్లని నితీశ్​ సైతం ఒక్కోసారి సహనం కోల్పోతున్నారు.

"తేజస్వీ యాదవ్​ దిల్లీలో ఏం చేసేవారో నాకు తెలుసు. అయితే అవన్నీ చెప్పి నేను ఆయన పొలిటికల్​ ఇమేజ్​ను దెబ్బతీయాలనుకోవడం లేదు."

- నితీశ్​ కుమార్, బిహార్​ సీఎం

తేజస్వీ బాణాలకు బదులేది?

అయితే ఇక్కడ సగటు బిహార్​ పౌరుడికి అర్థం కాని విషయం ఒక్కటే.. అది తేజస్వీ అడిగే ఏ ప్రశ్నకూ ఎన్​డీఏ నేతలు సహా సీఎం నితీశ్​ సమాధానం చెప్పకపోవడం. ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థం అవుతోంది. పద్మవ్యూహంలో కురుసేన మొత్తం అభిమన్యుడిపై దాడి చేసినట్లు మొత్తం ఎన్​డీఏ నేతలందరూ తేజస్వీపై మాటలదాడికి దిగుతున్నారు.

ఆ ఒక్కటి...

ఈ ఎన్నికల్లో తేజస్వీ ఇచ్చిన 10 లక్షల ఉద్యోగాల వాగ్దానం మొత్తం ఎన్​డీఏ నేతలనే ఆలోచనలో పడేసింది. ఉద్యోగాలు లేక యువత చూస్తున్న వేళ తేజస్వీ ఇచ్చిన ఈ వాగ్దానం ప్రస్తుత సందర్భంలో ఎన్​డీఏ పాలిట పాశుపతాస్త్రంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

ఇంకా చాలా ఉన్నాయి...

అయితే కేవలం ఈ వాగ్దానమే కాదు సీఎం నితీశ్​ కుమార్​కు ఆయన వేసే ప్రతి ప్రశ్న ప్రజల్ని ఆలోచింపజేస్తోంది.

"సీఎం నితీశ్​ జీ.. దయచేసి మీ 15 ఏళ్ల పరిపాలనలో చేసిన అభివృద్ధి ప్రోగ్రెస్​ కార్డును ప్రజల ముందు ఉంచండి."

- తేజస్వీ యాదవ్​, మహాకూటమి​ సీఎం అభ్యర్థి

మోదీ మాటల తూటాలను, నితీశ్​ విమర్శనాస్త్రాలను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ బిహార్​ ఎన్నికల రణరంగంలో తేజస్వీ రథం దూసుకుపోతోంది.

తేజస్వీ బ్రాండ్...

2012 నుంచి అప్పటి ప్రధాని మన్మోహన్​ సింగ్​ సర్కారు చేసే ప్రతి చట్టంపైనా మోదీ నేతృత్వంలోని భాజపా విమర్శలు చేసింది. అదంతా మోదీ పేరును ఓ బ్రాండ్​గా ప్రజల్లోకి పంపడానికే అన్నది విశ్లేషకుల మాట. 2014 లోక్​సభ ఎన్నికల్లో సూపర్​ హిట్​గా నిలిచింది 'మోదీ బ్రాండ్' అస్త్రం.​ ఎన్​డీఏ వాడిన అదే అస్త్రాన్ని తేజస్వీ వారిపైనే ఇప్పుడు సంధించారు. మరి ఈ 'తేజస్వీ బ్రాండ్' బంపర్​ హిట్​ అవుతుందా లేదా అనేది నవంబర్​ 10న తెలుస్తుంది.

Last Updated : Oct 25, 2020, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.