ETV Bharat / bharat

'నితీశ్​జీ.. 19 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఆశిస్తున్నా' - ఆర్జేడీ నేత తేజస్వీ

బిహార్​ ముఖ్యమంత్రిగా ఏడోసారి బాధ్యతలు చేపట్టిన జేడీయూ నేత నితీశ్​ కుమార్​కు శుభాకాంక్షలు తెలిపారు ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్​. అయితే.. మరోమారు ఆయన ఎన్నికను ప్రశ్నించారు. బిహార్​ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పని చేస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు.

Tejashwi wishes Nitish Kumar
నితీశ్​ కుమార్​కు తేజస్వీ శుభాకాంక్షలు
author img

By

Published : Nov 16, 2020, 8:34 PM IST

బిహార్​లో ఓట్ల లెక్కింపుపై అనుమానాలు వ్యక్తం చేస్తోన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​... తాజాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నితీశ్​ కుమార్​కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. మరోమారు ఆయన ఎన్నికను ప్రశ్నించారు తేజస్వీ. నితీశ్​ ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాదని, నామినేషన్ ద్వారా సీఎం అయ్యారని తన సామాజిక మాధ్యమ బ్లాగ్​​లో రాసుకొచ్చారు.

" ముఖ్యమంత్రిగా నామినేట్​ అయిన నితీశ్​ కుమార్​ జీకి నా శుభాకాంక్షలు. ఆయన కుర్చీ ఆశయం కోసం కాకుండా.. ఎన్​డీఏ హామీ ఇచ్చిన 19 లక్షల ఉద్యోగాల కల్పన, విద్య, వైద్యం, జీవనోపాధి, నీటిపారుదల, న్యాయం సహా బిహార్​ ప్రజల ఆక్షాంక్షలు నెరవేర్చుతారని నమ్ముతున్నా. "

- తేజస్వీ యాదవ్​, ఆర్జేడీ అధినేత.

నితీశ్​ ఎన్డీఏలోనే సీఎంగా ఉంటారనుకుంటున్నా..

బిహార్​కు జేడీయూ అధినేత నితీశ్​కుమార్​ ఎన్డీఏ తరఫునే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అనుకుంటున్నట్లు ఎల్​జేపీ నేత చిరాగ్​ పాసవాన్​ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఏడోసారి ప్రమాణస్వీకారం చేసిన నితీశ్​కు అయన వ్యంగ్యంగా శుభాకాంక్షలు తెలిపారు. 'మరోసారి సీఎం పదవి చేపట్టిన సందర్భంగా నితీశ్​కు శుభాకాంక్షలు. ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందని అనుకుంటున్నా. అదే విధంగా ఎన్డీఏ తరపునే సీఎంగా కొనసాగుతారని భావిస్తున్నా. మిమ్మల్ని సీఎంగా చేసిన భాజపాకు, సీఎం అయినందుకు మీకు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నా' అని చిరాగ్​ ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఎల్​జేపీ తనకు పంపిన మేనిఫెస్టోలని హామీల్ని నెరవేర్చే దిశగా నితీశ్​ పనిచేయాలని సూచించారు.

ఇదీ చూడండి: బిహార్​లో ఘనంగా నితీశ్ ప్రమాణ స్వీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.