ETV Bharat / bharat

బిహార్​ బరి: రెండో విడత​కు సర్వం సిద్ధం - బిహార్​ రెండో దశ పోలింగ్​

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్​కు సర్వం సిద్ధమైంది. రెండో దశ పోలింగ్​లో భాగంగా 94 స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2.85 కోట్ల మంది ఓటర్లు.. 1,463 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈ దఫాలోనే కీలక నేతలు, పలువురు మంత్రులు బరిలో ఉండటం ఆసక్తి రేపుతోంది.

Bihar polls
బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు
author img

By

Published : Nov 2, 2020, 4:57 PM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు దశల్లో కీలక ఘట్టంగా చెప్పుకుంటోన్న రెండో దఫా పోలింగ్​కు సర్వం సిద్ధమైంది. 94 స్థానాలకు మంగళవారం(నవంబర్​ 3న) ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం 17 జిల్లాల్లో మొత్తం 41,362 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. కరోనా దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది.

రెండో దఫా పోలింగ్​ విశేషాలు:

  • 2.85 కోట్ల మంది ఓటర్లు.. 1,463 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. బరిలో నిలిచిన మొత్తం అభ్యర్థుల్లో 10 శాతం (146) మంది మహిళలు ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య 1.35 కోట్లుగా ఉంది.
  • మహారాజ్​గంజ్​ నియోజకవర్గంలో అత్యధికంగా 27 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. అత్యల్పంగా దరౌలిలో నలుగురు పోటీలో ఉన్నారు.
  • ప్రధాన పార్టీల్లో ఆర్జేడీ 56 స్థానాలు, దాని భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్​ 24 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇటీవలే మహాకూటమిలో చేరిన సీపీఐ, సీపీఎం నాలుగు సీట్లలో బరిలో నిలుస్తున్నాయి.
  • ఎన్డీఏలో భాగమైన భాజపా 46 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. జేడీయూ 43 స్థానాల్లో బరిలో నిలుస్తోంది. ముకేశ్​ సాహ్నీకి చెందిన వీఐపీ.. మిగిలిన ఐదు స్థానాల్లో పోటీ చేస్తోంది.
  • లోక్​జన శక్తి పార్టీ 52 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈసారి ఓ ట్రాన్స్​జెండర్​ను బరిలో నిలిపింది.

మొత్తం అసెంబ్లీ స్థానాల్లో రెండో దశలోనే అత్యధిక స్థానాలకు ఓటింగ్​ జరగటం సహా.. కీలకమైన అభ్యర్థులు బరిలో ఉండటం ఆసక్తి రేపుతోంది. ప్రతిపక్ష మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​ సహా బడా రాజకీయ నేతలు, తలపండిన సీనియర్లు, ప్రస్తుత ప్రభుత్వంలోని పలువురు మంత్రులు బరిలో ఉన్నారు.

ఇవీ చూడండి: బిహార్ బరి: రెండోదఫాలో వీరి దశ తిరిగేనా?

బిహార్ బరి: సీమాంచల్​లో ఆధిపత్యం ఎవరిది?

బిహార్‌ పోరులో ముస్లిం ఓటరు ఎటువైపు?

బిహార్​ నాయకుల్లో గుబులు రేపుతున్న 'నోటా' మీట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.