మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు తేజస్ ఠాక్రే తన సహచరుడు అక్షయ్ ఖండేకర్తో కలిసి అరుదైన బల్లి జాతిని కనుగొన్నాడు. కర్ణాటక సుక్లేశ్పూర్లోని అటవీ ప్రాంతంలో ఈ అరుదైన బల్లి జాతులను గుర్తించినట్లు అతను తెలిపాడు.
హాట్స్పాట్
తేజస్ ఠాక్రే, అక్షయ్ ఖండేకర్, ఇషాన్ అగర్వాల్, సోనక్ పాల్... ఈ నలుగురు పరిశోధకుల బృందం 2014లోనే కొన్ని బల్లి జాతులను కనుగొంది. తాజాగా వీరి బృందం అక్షయ్ ఖండేకర్ నేతృత్వంలో... జీవవైవిధ్యానికి నెలవైన పశ్చిమ కనుమల్లో అరుదైన బల్లి జాతిని గుర్తించింది.
"మనం రోజూ చూసే సాధారణ బల్లి (లార్జ్ బాడీ సినామాస్పిస్) జాతికే చెందిన ఒక మరుగుజ్జు బల్లిని కనుగొన్నాం. ఇది సిమామాస్పిస్ హెటెరోఫోలిస్ బాయర్ జాతి బల్లిలాగే కనిపించినా.. శరీర పరిమాణంలో తేడా ఉంటుంది."
- అక్షయ్ ఖండేకర్, పరిశోధన బృంద సభ్యుడు
వీరి పరిశోధన వ్యాసం (పేపర్)... అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన సైంటిఫిక్ జర్నల్ జూటాక్సాలో ప్రచురితమైంది.
50 బల్లి జాతులు
భారతదేశంలో 50 రకాల బల్లి జాతులు కనిపిస్తాయి. పెద్ద పెద్ద కళ్లతో, ప్రత్యేక శరీర నిర్మాణం కలిగి.. జంతు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
ఇదీ చూడండి: ఏనుగు నోటికి గాయం- టపాసులే కారణం?
ఇదీ చూడండి: లాక్డౌన్ అంటే అత్యయిక స్థితి కాదు: సుప్రీం