ETV Bharat / bharat

వీరుడికి పాక్​లో వీరాభిమానులు - పుల్వామా ఉగ్రదాడి

భారత పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్​కు భారత్​లోనే కాదు దాయాది దేశం పాకిస్థాన్​లో అభిమానం వెల్లువెత్తుతోంది. ఈ యుద్ధ వీరుడిని ఇరుదేశాల మధ్య స్నేహ వారధిగా పేర్కొంటూ పాక్​లోని ఓ టీ స్టాల్​ ముందు బ్యానర్ వెలిసింది.

పాకిస్థాన్​లోని ఓ టీస్టాల్​లో అభినందన్​ బానర్​
author img

By

Published : Mar 13, 2019, 9:37 AM IST

Updated : Mar 13, 2019, 10:26 AM IST

ఒక భారత జవాన్​కు పాకిస్థాన్​లో అభిమానులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? నమ్మశక్యం కాకపోయినా అదే నిజం. సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్న ఈ విషయాన్ని మీరే చూడండి.

పాకిస్థాన్​లోని ఓ టీ స్టాల్​లో వింగ్​ కమాండర్​ అభినందన్​ ఛాయ్​ తాగుతున్నట్లు ఓ బానర్ పెట్టారు. దానిపై " ఐసీ ఛాయ్​ దుష్మన్​ కో భీ దోస్త్​ బనాయే​" అని రాసి ఉంది. ఈ విధంగా అభినందన్ ఇరుదేశాల మధ్య స్నేహ వారధి నిర్మించినవారయ్యారు.

పాక్ సైన్యం చేతికి చిక్కినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నిలిచిన అభినందన్​కు దాయాది పాకిస్థాన్​లోనూ అభిమానులు ఏర్పడ్డారు. అభినందన్​ను భారత్​-పాక్​ల మధ్య స్నేహ రాయబారిగా భావిస్తున్నారు.

పాకిస్థాన్​లోని ఈ టీ స్టాల్​, దాని బ్యానర్ చిత్రాలను ట్విట్టర్​లో ఒమర్ ఫరూక్​ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వార్త​ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

'వర్థమాన్ అభినందన'లు!

పుల్వామా ఉగ్రదాడిలో భారత సీఆర్పీఎఫ్​ జవానులు 40 మంది అమరులయ్యారు. దీనికి ప్రతీకారంగా పాక్​ ఆక్రమిత కశ్మీర్​ బాలాకోట్​లోని జైషే మహమ్మద్ ఉగ్రస్థావరాలపై భారత్​ దాడి చేసింది. ప్రతిగా పాకిస్థాన్ భారత భూభాగంపై వైమానిక దాడికి పాల్పడింది. దీనిని భారత్​ దీటుగా తిప్పికొట్టింది.

వింగ్ కమాండర్ అభినందన్​ తన మిగ్​-21తో పాక్​కు చెందిన ఎఫ్​-16 యుద్ధ విమానాన్ని కూల్చేశారు. తరువాత తన మిగ్​ను కోల్పోయి, పాక్ భూభాగంలో దిగారు. అతనిపై స్థానికులు దాడి చేశారు. అనంతరం పాక్​ సైన్యం అతనిని అదుపులోకి తీసుకుంది. ఆ సమయంలో అభినందన్ చూపిన ధైర్యసాహసాలు, ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకున్నాయి.

భారత దౌత్యం, అంతర్జాతీయ ఒత్తిడితో పాక్​ అభినందన్​ను శాంతి సూచికగా విడుదల చేసింది. ఈ అసమాన వీరకిశోరం వాఘా సరిహద్దు ద్వారా భారత్​ చేరుకున్నారు. భారత దేశమంతా అతని రాకతో సంబరాలు చేసుకున్నారు.

Intro:Body:Conclusion:
Last Updated : Mar 13, 2019, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.