ETV Bharat / bharat

'లాక్​డౌన్​తో రక్షించిన ప్రాణాల్ని అవి హరిస్తాయి'

లాక్​డౌన్​తో ప్రభుత్వాలు ఎంతమంది ప్రాణాలను రక్షించినా.. క్షయ, కలరా వంటి రోగాల వల్ల కలిగే మరణాలు ఆ సంఖ్యను సమం చేస్తాయని ఆరోగ్య నిపుణులు వీ రమణ హెచ్చరించారు. కరోనాపై పోరాటం చేస్తూ ఇతర రోగాలను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.

author img

By

Published : May 24, 2020, 1:25 PM IST

TB, cholera deaths may cancel out lives saved during lockdown: Health expert
"లాక్​డౌన్​తో కాపాడినా.. ఆ వ్యాధుల మరణాలు సమం చేస్తాయి"

మహమ్మారి కరోనా వైరస్​పైనే ప్రభుత్వాలన్నీ దృష్టి పెట్టాయి. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు లాక్​డౌన్​ సహా అన్ని చర్యలు చేపట్టాయి. వైద్య సదుపాయాల్లోనూ కరోనాపై పోరుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే లాక్​డౌన్​తో ఎన్ని ప్రాణాలు కాపాడినా.. క్షయ, కలరాతో కలిగే మరణాలు ఆ ప్రాణనష్టాన్ని సమం చేస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

క్షయ, పౌష్టికాహార లోపం, కలరాతో పొంచి ఉన్న ప్రాణ ముప్పును కూడా గుర్తించాలని ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ పబ్లిక్​ హెల్త్ ​(ఐఐపీహెచ్​- హైదరాబాద్)​లోని ప్రొఫెసర్​ వీ. రమణ సూచించారు. లాక్​డౌన్​తో వాటిని నిర్లక్ష్యం చేస్తున్నామన్నారు.

"లాక్​డౌన్​తో ప్రాణాలు కాపాడినప్పటికీ.. ఈ వ్యాధుల (క్షయ, కలరా)తో సంభవించే మరణాలు ఆ ప్రాణనష్టాన్ని సమం చేస్తాయి. మనిషి పర్యావరణాన్ని నాశనం చేసి, జంతువుల నివాసాలకు ఎసరు పెడుతున్నాడు. అందుకే ఈ విపత్తును.. ప్రకృతి ఇచ్చిన సమాధానంగా మనం భావించాలి."

-- వీ రమణ, ఐఐపీహెచ్​ ప్రొఫెసర్​.

మే చివరి నాటికి దేశంలో లక్ష కేసులు ఉంటాయని అంచనా వేసినప్పటకీ.. ఇప్పటికే ఆ సంఖ్య లక్షా 25వేలు దాటిపోయిందని తెలిపారు రమణ. కేసుల సంఖ్య మరింత పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.