దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
మహారాష్ట్రలో కొవిడ్ కేసుల సంఖ్య ఏడు లక్షలకు చేరువైంది. కొత్తగా 11,015 కేసులు నమోదు కాగా రాష్ట్రంలో బాధితుల సంఖ్య 6,93,398కి చేరింది. ఒక్కరోజే 212 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 22,465కి ఎగబాకింది.
రాజధానిలో
దిల్లీలో సోమవారం 1,061 కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1.62 లక్షలకు చేరింది. 13 మంది మరణంతో మొత్తం మృతుల సంఖ్య 4,313కి పెరిగింది.
- తమిళనాడులో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. మరో 5,967 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇవాళ 97 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కేసులు 3,25,456కి, మరణాలు 6,614కి పెరిగాయి.
- పంజాబ్లో 1,516 మందికి తాజాగా కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 43,284కి పెరిగాయి. రాష్ట్రంలో కరోనా కారణంగా 1,129 మంది మరణించారు.
- గుజరాత్లో సోమవారం 1,067 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 87,846కి చేరింది. మరో 13 మంది మరణంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,910కి పెరిగింది.