తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా 5,609 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 109మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 2,63,222గా నమోదైంది. ఇప్పటివరకు 4,241 మంది వైరస్‌కు బలయ్యారు.
యూపీలో రికార్డు స్థాయిలో..
ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. 24 గంటల్లోనే 4,473 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 50మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 97,362కి చేరింది. మృతుల సంఖ్య 1,778కి పెరిగింది.
దిల్లీలో 805..
దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 805 మందికి వైరస్ సోకింది. మరో 17మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 1,38,482కి చేరింది. మృతుల సంఖ్య 4,021కి పెరిగింది. వ్యాధి బారినపడి 1,24,254 మంది కోలుకున్నారు.
ఒడిశాలో..
ఒడిశాలో కొత్తగా నమోదైన 1,384కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 36,297కి చేరింది. మరో 10మంది మృతితో మొత్తం మరణాల సంఖ్య 207కి పెరిగింది.
భద్రతా సిబ్బందికి పాజిటివ్
మేఘాలయలో 20 మంది భద్రతా సిబ్బంది సహా కొత్తగా 28మంది కొవిడ్ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 902కి పెరిగింది. ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
మణిపుర్లో 84
మణిపుర్లో 84 కొత్త కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల సంఖ్య 2,920కి చేరగా.. ఇప్పటివరకు ఏడుగురు మృత్యువాత పడ్డారు.