తమిళనాడు తిరుప్పూర్ జిల్లాలోని అవినాషి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొని ఐదుగురు వైద్య విద్యార్థులు, ఓ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
పారామెడికల్ కళాశాల విద్యార్థులు కారులో ఇవాళ ఉదయం ఊటీకి విహార యాత్రకు బయలుదేరారు. ఉదయం 5 గంటల సమయంలో వారి కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది.
ఇదీ చూడండి: కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఏం చేయాలంటే..