ETV Bharat / bharat

కరోనా పంజా: తమిళనాట 6 వేలకు మరణాలు

తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య ఆరు వేలు దాటింది. కొత్తగా 5 వేలకుపైగా కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య 3.5 లక్షలకు చేరువైంది. ఒడిశా, కేరళలోనూ కొవిడ్ ప్రబలుతోంది. మణిపుర్​లో మరో ఐదుగురు కేంద్ర సాయుధ బలగాలకు కరోనా సోకింది.

author img

By

Published : Aug 18, 2020, 7:21 PM IST

Tamil Nadu reports 5,709 new #COVID19 cases and 121 deaths
కరోనా విజృంభణ: తమిళనాడులో 6 వేలకు మరణాలు

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. తమిళనాడులో కరోనా మృతుల సంఖ్య 6 వేల మార్క్ అందుకుంది. కొత్తగా 5,709 కేసులు బయటపడ్డాయి. మరో 121 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,49,654కి చేరగా.. మృతుల సంఖ్య 6,007కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 53,860 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

క్వారంటైన్ సెంటర్లలోనే అధికం

ఒడిశాలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. కేసుల సంఖ్య 64,533కి చేరింది. కొత్తగా 2,239 కేసులు నమోదుకాగా.. 9 మంది మరణించారు. మృతుల సంఖ్య 362కి చేరింది. కొత్తగా గుర్తించిన కేసుల్లో 1,416 కేసులు క్వారంటైన్ సెంటర్​ల నుంచే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

16 వేలకు

కేరళలో మరో 1,758 కరోనా కేసులు గుర్తించారు అధికారులు. రాష్ట్రంలో 16,274 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 31,394 మంది కోలుకున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు.

జమ్ము కశ్మీర్​

జమ్ము కశ్మీర్​లో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. 434 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. కశ్మీర్ డివిజన్​లో 346, జమ్ము డివిజన్​లో 88 మందికి వైరస్ సోకినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ వెల్లడించారు. దీంతో ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో కేసుల సంఖ్య 29,326కి పెరిగినట్లు తెలిపారు. మరణాల సంఖ్య 561కి చేరినట్లు చెప్పారు.

33 శాతం పాజిటివిటీ రేటు

పుదుచ్చేరిలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా 9మంది మరణించగా.. మరో 370 మంది కొవిడ్ బారినపడ్డారు. దీంతో ఈ ప్రాంతంలో కేసుల సంఖ్య 8,396కి పెరగ్గా.. మరణాల సంఖ్య 123కి చేరింది. ప్రస్తుతం 3,364 యాక్టివ్ కేసులు ఉండగా... 4,909 మంది డిశ్చార్జ్ అయ్యారు.

పాజిటివిటీ రేటు 33.45గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరణల రేటు 1.46, రికవరీ రేటు 58.47కి చేరినట్లు చెప్పారు.

కేంద్ర బలగాలే అధికం

మణిపుర్​లో 78 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇందులో ఐదుగురు కేంద్ర సాయుధ పోలీసు దళాలకు చెందిన సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 4,765కి పెరిగింది. బాధితుల్లో కేంద్ర బలగాలే 1,221మంది ఉన్నట్లు రాష్ట్ర వైద్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 58.53 శాతానికి పెరిగినట్లు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి- మరిన్ని విమానాశ్రయాల ప్రైవేటీకరణకు ప్రతిపాదనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.