తమిళనాడులో తిరునెల్వెలి జిల్లాలోని రెండు ప్రాంతాల్లో శనివారం విస్తృత సోదాలు చేపట్టింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉగ్రకార్యకలాపాలు సాగుతున్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేపట్టినట్లు కొచ్చికి చెందిన ఐదుగురు సభ్యుల బృందం తెలిపింది.
ఉదయం 7 గంటల సమయంలో నగరంలో సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ.. అన్సరుల్లా ఉగ్రసంస్థకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది.
గతంలోనూ..
జులై నెలలో అన్సరుల్లా ఉగ్రసంస్థ కేసు విచారణలో భాగంగా తమిళనాడులోని సుమారు 10 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. చెన్నై, మదురై, తిరునెల్వెలి, రామనాథపురం జిల్లాలకు చెందిన 16 మందిని అరెస్ట్ చేసింది. వీరంతా అల్‌ఖైదాకు మద్దతిస్తున్నారని పేర్కొంది.