తమిళనాడులోని తిరుప్పుర్లో చెల్లముత్తు అనే రైతుకు చెందిన ఓ వృషభం ఆకస్మికంగా మరణించింది. ఏళ్ల తరబడి పొలం పనుల్లో తనకు చేదోడు వాదోడుగా ఉండే ఎద్దు చనిపోవడం అతడిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆ జ్ఞాపకాలను మరచిపోలేని చెల్లముత్తు.. తన పొలంలోనే దాన్ని ఖననం చేశాడు. అనంతరం.. రూ. 2 లక్షలు ఖర్చుచేసి దానికి ఓ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయించాడు.
సోమవారం ఆ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించాడు చెల్లముత్తు. గ్రామ ఉత్సవంగా జరిగిన ఈ కార్యక్రమానికి అతడి బంధుమిత్రులతో సహా.. ఆ ఊరి ప్రజలు కూడా భారీ ఎత్తున తరలివచ్చారు.
ఇదీ చూడండి: వరదల్లో చిక్కుకున్న వానరాన్ని కాపాడిన ఎస్డీఆర్ఎఫ్