ఆలయాల్లోని ఏనుగుల సంరక్షణ కోసం తమిళనాడు ప్రభుత్వం ఏటా ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తుంది. ఈసారి కోయంబత్తూర్లోని తెక్కంపట్టిలో ఏర్పాటు చేసిన శిబిరంలో ఆండాల్ అనే ఏనుగు ప్రత్యేక ఆకరర్షణగా నిలిచింది. సంగీత వాయిద్యం 'మౌత్ ఆర్గాన్' వాయిస్తూ ఆకట్టుకుంది. ఫుట్బాల్ కూడా చక్కగా ఆడుతోంది.
శ్రీరంగం ఆలయంలో ఉండే ఈ గజరాజుకు రాజేశ్ అనే వ్యక్తి శిక్షణ ఇస్తున్నాడు. ఆండాల్ చెప్పిన పనిని కాదనకుండా చేసేస్తుందని అంటున్నాడు.
"ఆండాల్ చాలా సున్నితమైనది. మౌత్ ఆర్గాన్ను చాలా బాగా వాయిస్తుంది. మీరు అరటి పండు ఇస్తే దాని తొక్క తీసి తింటుంది. శ్రీరంగం ఆలయంలో తన విధులు నిర్వర్తించేందుకు నిరాకరించదు."
- రాజేశ్.
ఏడాదికి ఒకసారి ఇలాంటి క్యాంపులు నిర్వహించటం ద్వారా ఏనుగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు వాటి సంరక్షకులు. వివిధ ఆలయాల నుంచి వచ్చే ఏనుగులతో వాటికి బంధం ఏర్పడి ఉల్లాసంగా ఉంటాయని అంటున్నారు.
2003 నుంచి..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆలయాల్లోని గజరాజులను సంరక్షించేందుకు పునరుత్తేజనం పేరిట 2003లో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఏటా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో గజరాజులకు పౌష్టికాహారం, వైద్యం అందిస్తారు.
ఇదీ చూడండి: ట్రాన్స్జెండర్ల ఐకమత్యం- రూ.కోటితో భవన నిర్మాణం