ETV Bharat / bharat

ఈ డాక్టర్​ చికిత్స చూస్తే అవాక్కవ్వాల్సిందే! - డాక్టర్​ వింత చికిత్స

గొంతు నొప్పితో బాధపడుతున్న ఓ బాధితుడికి 5 మీటర్ల దూరం నుంచి ఓ వైద్యుడు చికిత్స అందించిన ఘటన తమిళనాడు విల్లుపురంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ కావటం వల్ల ఆ వైద్యుడిని మరొక ప్రాంతానికి బదిలీ చేశారు.

Tamil Nadu doctor screens patient from 5 metres away, transferred
ఈ డాక్టర్​ చికిత్స పద్ధతి చూస్తే అవాక్కవాల్సిందే!
author img

By

Published : Jun 11, 2020, 6:10 PM IST

Updated : Jun 11, 2020, 6:43 PM IST

కరోనా వైరస్ భయంతో రోగిని పరీక్షించడానికి ఓ వైద్యుడు ఉపయోగించిన ప్రత్యేక పద్ధతి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. గొంతు నొప్పితో బాధపడుతున్న ఆ బాధితుడుని ఐదు మీటర్ల దూరంలో ఉంచి స్క్రీనింగ్​ చేసి పంపించాడు సదరు వైద్యుడు. ఈ ఘటన తమిళనాడు విల్లుపురంలో జరిగింది.

ఈ డాక్టర్​ చికిత్స పద్ధతి చూస్తే అవాక్కవాల్సిందే!

ఇదీ జరిగింది...

కండమంగళం గ్రామంలో గొంతు నొప్పితో బాధపడుతున్న ఓ బాధితుడు జూన్​ 9న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. అందరిలాగే చికిత్స చేయించుకోవటానికి క్యూలైన్లో నిలుచున్నాడు. తన వంతు వచ్చే సమయానికి గడప బయట ఉన్నాడు. ఆ కేంద్రంలోని వైద్యుడు లోపలి నుంచే టార్చ్​లైట్​ ద్వారా అతడికి పరీక్ష చేశాడు . వీరిద్దరి మధ్య దూరం ఐదు మీటర్లు ఉంటుంది. అనంతరం అక్కడ పని చేసే మహిళా నర్సు ద్వారా.. తను రాసిన మందుల చీటీని బాధితుడికి అందించాడు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలను మరొక పెషంట్​ తన చరవాణిలో బంధించాడు.

ఈ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారటం వల్ల ఆ వైద్యుడిపై విల్లుపురం ఆరోగ్య విభాగాధికారులు చర్యలు తీసుకొని మరొక ప్రాంతానికి బదిలీ చేశారు.

ఇదీ చూడండి:రూ.100 కోట్లు విలువ చేసే హెరాయిన్ పట్టివేత

Last Updated : Jun 11, 2020, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.