తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వ్యక్తిగత కార్యదర్శి దామోదరన్ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందారు.
ప్రముఖులపై కరోనా పంజా
వైరస్ బారిన పడిన చెన్నై చేపాక్కం ఎమ్మెల్యే, డీఎంకే నేత అన్బళగన్.. జూన్ 10న మృతి చెందారు. దేశంలో కరోనా సోకి మరణించిన తొలి ఎమ్మెల్యే ఆయనే.
రాష్ట్రంలో ఇప్పటివరకు 20,700 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. 191 మంది ప్రాణాలు కోల్పోయారు.