ETV Bharat / bharat

'ఎక్కువ మాట్లాడండి... కరోనాను జయించండి!' - కరోనా వైరస్ వార్తలు

కరోనా భయాన్ని జయించేందుకు ఎక్కువ మాట్లాడాలి అంటున్నారు ప్రపంచ ప్రఖ్యాత ధ్యానగురు దీపక్ చోప్రా. లాక్​డౌన్​ సమయంలో ధ్యానం చేసి వైరస్​ ఒత్తిడి నుంచి బయటపడొచ్చు అంటున్నారు.

talking more  to friends and family  helps to overcome corona fear says world famous meditation guru and author deepak chopra
'ఎక్కువ మాట్లాడండి... కరోనాను జయించండి!'
author img

By

Published : Mar 31, 2020, 1:30 PM IST

వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారిని చూసి కొందరు బెంబేలెత్తిపోతున్నారు. మరికొందరు లాక్​డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమై ఒంటరితనం, ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ అనవసర ఆందోళనలకు చెక్​ పెట్టి, మనస్సును నిశ్చలంగా ఉంచుకునేందుకు ఓ ఉపాయం చెబుతున్నారు.. ప్రపంచ ప్రఖ్యాత ధ్యానగురువు, రచయిత దీపక్ చోప్రా. మనసుకు నచ్చినవారితో ఎక్కవ సేపు మాట్లాడడం వల్ల కరోనా ఒత్తిడిని జయించవచ్చు అంటున్నారు.

'ఎక్కువ మాట్లాడండి... కరోనాను జయించండి!'

"ఈ గజిబిజి జీవితాల్లో ఓ ఫోన్​కాల్​ రెండు మూడు నిమిషాలు మాట్లాడే సమయం కూడా దొరకట్లేదు. కానీ, సామాజిక దూరం వల్ల ఇప్పుడు ఆ సమయం ఉంది. మీకు నచ్చిన కుటుంబ సభ్యుడితోనో, స్నేహితుడితోనో గంటల తరబడి మాట్లాడి ఫలితాన్ని పొందండి. అయితే వారితో వైరస్​ గురించి ఎక్కువగా మాట్లాడొద్దు. ప్రతి ఒక్కరిలో ఏదో ఓ స్థాయిలో శాంతి, నిశ్చలత్వము ఉంటుంది. దానిని వీలైనంత ఎక్కువమంది అనుభవించాలి. వైరస్​ను జయించే సానుకూల పరిష్కారం కనుగొనకపోతే, ఇక దాని గురించి చింతించి ప్రయోజనం ఏమిటి? ఇలాంటి సమయంలోనే మనం మరింత దృఢమైన వ్యక్తుల్లా మారాలి."

-దీపక్​ చోప్రా, ప్రపంచ ప్రఖ్యాత ధ్యాన గురు

కరోనా భయాన్ని పోగొట్టేందుకు ధ్యానం ఎంతో సహకరిస్తుందని​ పేర్కొన్నారు దీపక్. న్యూయార్క్​ వెల్​నెస్​ క్లబ్​ ​ఆధ్వర్యంలో ఆదివారం ఆయన ఆన్​లైన్​ ధ్యాన కార్యక్రమం చేపట్టారు. ఇంట్లో నుంచే లైవ్​ వీడియో ద్వారా ధ్యానం ఎలా చేయాలో వివరించారు.

ఇదీ చదవండి:అమెరికా కంటే భారత్‌లోనే కరోనా మరణాల రేటు ఎక్కువ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.