ETV Bharat / bharat

సేంద్రియ 'డ్రాగన్'​కు భలే గిరాకీ - dragon fruit farming in kerala

భారత నేలను నమ్మి.. ఓ రైతు అద్భుతమే సృష్టించాడు. విదేశాల్లో మాత్రమే పండుతుందనుకున్న డ్రాగన్​ ఫ్రూట్​ను కేరళ మట్టిలో సాగు చేశాడు. రసాయనాలు మచ్చుకైనా వాడకుండా.. సహజంగా పండించి శభాష్​ అనిపించుకుంటున్నాడు.

Sweet Dragons aplenty in this organic farm at Malappuram
మన 'డ్రాగన్'​ పండింది.. రసాయనాలు లేకుండానే కోతకొచ్చింది!
author img

By

Published : Jun 26, 2020, 12:24 PM IST

గులాబి రంగులో.. పైనాపిల్​కు తామర రెబ్బలు అతికించినట్టుగా అందంగా ఆకర్షిస్తుంది డ్రాగన్​ ఫ్రూట్​. సూపర్​ మార్కెట్లలో, రోడ్లపై పండ్ల బండ్లలో ప్రత్యేకంగా ఆకట్టుకునే ఈ పండు చూడటానికే కాదు.. రుచితో మైమరపిస్తుంది కూడా. ఔషధ గుణాలతో ఆరోగ్యాన్నిస్తుంది. అయితే, ఇన్నాళ్లు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ విదేశీ పండు.. ఇప్పుడు స్వదేశీ పండు అయిపోయింది. డ్రాగన్​ ఫ్రూట్​ను మన నేలపైనే పండిస్తున్నారు కేరళకు చెందిన ఓ రైతు.

రసాయనాలు లేకుండానే కోతకొచ్చిన డ్రాగన్

మలప్పురం జిల్లా వాట్టలూర్​ గ్రామానికి చెందిన ఉమర్​కుట్టి చాలాకాలం విదేశాల్లో పనిచేశాడు. ఫారిన్​లో ఈ పండుకున్న డిమాండ్​ను గమనించాడు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని తెలుసుకున్నాడు. విదేశాల నుంచి తిరిగొచ్చాక వ్యవసాయంపైనే దృష్టి పెట్టాడు. ఇతర ఫలాలు, పంటలతో పాటు.. కొంత భూమిలో డ్రాగన్​ ఫ్రూట్​ మొక్కలు నాటాడు.

జముడు జాతికి చెందిన ఈ డ్రాగన్​ మొక్కలను సులభంగా సాగు చేయడం తెలుసుకుని.. శ్రద్ధగా పెంచాడు ఉమర్​. పైగా ఎలాంటి రసాయనాలు వాడకుండా పంటను సాగు చేశాడు. ఉమర్​ కృషి ఫలించింది. ఇన్నాళ్లు.... మెక్సికో, థాయ్​లాండ్​, ఇజ్రాయెల్​, వియత్నాం, శ్రీలంక వంటి దేశాల్లో పండిన డ్రాగన్​ ఫ్రూట్​ను తెగ ఇష్టపడ్డ కేరళ వాసులు.. ఉమర్​ కుట్టి పండించిన లోకల్​ డ్రాగన్​ ఫ్రూట్​కు ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు బయట దొరికే హైబ్రీడ్​ డ్రాగన్​ ఫ్రూట్స్​ కంటే.. ఉమర్​ పండించిన సేంద్రియ డ్రాగన్​ ఫ్రూట్​కే డిమాండ్​ ఎక్కువగా ఉంది.

ఇదీ చదవండి:ఏం ఐడియా గురూ: అమ్ముడవని అరటిపళ్లను ఎండబెట్టి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.