బంగాల్ కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేసిన సువేందు అధికారికి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కు మధ్య విబేధాలు మరింత పెరుగుతున్నాయి. సువేందుది 'ముగిసిన అధ్యయంగా' టీఎంసీ పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనను వెనక్కి రప్పించేందుకు ఇక ముందు అధిష్ఠానం ఎటువంటి ప్రయత్నాలు చేయబోదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
సువేందును బుజ్జగించడానికి తదుపరి ప్రయత్నం చేయకూడదని టీఎంసీ నేతలు నిర్ణయించుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. స్వయంగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ... సువేందుతో ఎటువంటి చర్చలు జరపవద్దని సూచించినట్లు వెల్లడించాయి.
'టీఎంసీ అతి పెద్ద పార్టీ. పార్టీని సమర్థంగా ముందుకు నడిపిచగల దీదీ లాంటి నేతలున్నంత వరకు పార్టీకి ఎలాంటి నష్టం జరగదు' అని టీఎంసీ సీనియర్ నేత ఎంపీ సౌగత్ రాయ్ అన్నారు. ఒకరిద్దరు పార్టీని వీడినంత మాత్రనా పార్టీపై ఎటువంటి ప్రభావం పడదని.. సువేందును ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు రాయ్.
సువేందు పార్టీ వీడనున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. భాజపాలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్గాలు నుంచి వస్తున్న వార్తలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: టీఎంసీకి సువేందు షాక్ ఇవ్వడం ఖాయమా?